హోమ్ /వార్తలు /క్రైమ్ /

Minors Taken Nude photos: దారుణం.. మహిళ బట్టలు విప్పి ఫొటోలు తీసిన మైనర్లు.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి..

Minors Taken Nude photos: దారుణం.. మహిళ బట్టలు విప్పి ఫొటోలు తీసిన మైనర్లు.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండంలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్​ (minor) బాలురు దారుణానికి ఒడి గట్టారు.

  ప్రపంచంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, స్కూల్, కాలేజీ , పనిచేసే ఆఫీసు ఎక్కడయినా మహిళలు, చిన్నారులను వదిలిపెట్టడం లేదు. ముక్కుపచ్చలారని చిన్నారులు మొదలు పండు ముసలి వరకు ఎవ్వరికీ మృగాళ్ళ చేతిలో నలిగిపోతున్న అనేక ఘటనలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ మధ్యలో టెక్నాలజీ విపరీత పోకడలకు దారి తీస్తోంది. మైనర్లు కూడా ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా భువనగిరి (Bhonagiri) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండంలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్​ (minor) బాలురు దారుణానికి ఒడి గట్టారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ మహిళ (40) వస్త్రాలను తొలగించి ఇద్దరు మైనర్లు.. ఆమె ఫొటోలు (photos)ను తీశారు. ఆ తరువాత ఆ ఫొటోలను (Photos) ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు.

  అంతేకాకుండా నగ్న చిత్రాలను (Nude photos) సోషల్​ మీడియాలో (social media)లో వారి స్నేహితులకు షేర్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒక మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. మైనర్లలో పెరుగుతున్న ఈ నేరప్రవృత్తి మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  50 లక్షలు జరిమానా..

  ఇటీవలె ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. భార్య అశ్లీల ఫోటోలు తీసిన ఓ ప్రబుద్ధుడు... ఆమె కుటుంబసభ్యులకే వాటిని పంపించాడు. ఎందుకిలా చేశాడంటే... ఆమె చేసే పనులు నచ్చకనే ఇలా చేశానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూఏఈలో జరిగిన ఈ సంఘటన.. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. యూఏఈకి చెందిన ఓ వ్యక్తి.. భార్య స్నానం చేస్తుండగా... బట్టలు మార్చుకుంటుండగా తన సెల్‌ఫోన్‌‌లో వీడియోలు తీశాడు. వీటిని ఫేస్‌బుక్ మెసేంజర్ ద్వారా ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు. బావ అకౌంట్ ద్వారా చెల్లెలి న్యూడ్ ఫోటోలు, వీడియోలు రావడం చూసి ఆమె సోదరుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే చెల్లెలికి విషయం చెప్పాడు. భర్త చేసిన పనికి షాక్‌కు గురైన ఆమె... అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  కేసు నమోదు చేసుకున్న పోలీసులు... డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు భర్త ఫోన్ నుంచే వీడియోలు, ఫోటోలు పంపినట్టు ఖరారు చేశారు. అయితే ఈ పని ఎందుకు చేశావని అతడిని ప్రశ్నించగా... అతను చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. భార్యకు శుభ్రత అస్సలు ఉండదని, పిచ్చిపిచ్చిగా ఉంటుందని... స్నానం చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు ఆమె చేసే అసభ్యపనులు నచ్చకనే వాటిని వీడియో తీసి ఆమె కుటుంబసభ్యులకు చూపించానని పేర్కొన్నాడు సదరు వ్యక్తి. మనోడు చేసిన పనికి పరువు నష్టం దావా వేసిన అతని భార్యకు నష్టపరిహారంగా రెండున్నర లక్షల దిర్హామ్‌లు (దాదాపు 50 లక్షల రూపాయలు) చెల్లించాలని తీర్పు వెలువరించింది అబుదాబీ కోర్టు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Minor, Nude photos, WOMAN

  ఉత్తమ కథలు