ఆరునెలల గర్భిణికి మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారం.. ఆపై పెళ్లి.. ఆపై..

ప్రతీకాత్మక చిత్రం

గర్భవతికి మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాదు. ఆమెను కిడ్నాప్ చేసి ఒకడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలసి ఆమె మీద అత్యాచారం చేశారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆరు నెలల గర్భిణిని మరో ముగ్గురు యువకులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బెదిరించారు.

 • Share this:
  గర్భవతికి మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాదు. ఆమెను కిడ్నాప్ చేసి ఒకడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలసి ఆమె మీద అత్యాచారం చేశారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆరు నెలల గర్భిణిని మరో ముగ్గురు యువకులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బెదిరించారు. వారి చెర నుంచి తప్పించుకుని పరారై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. అసోంకు చెందిన ఆరు నెలల గర్భిణికి ఇద్దరు యువకులు మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె మూడు నెలల కుమార్తెను కూడా తీసుకుని అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్లిపోయారు. అక్కడ అత్యాచారం చేసిన ఒకడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత మళ్లీ వారిద్దరూ ఆమె మీద అత్యాచారం చేశారు. అయితే, ఇంతటితో ఆగని దుర్మార్గులు ఆమెను మరో ముగ్గురి వద్దకు పంపేందుకు ప్రయత్నించారు. మూడు రోజుల క్రితం బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకుని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తన మూడేళ్ల కూతుర్ని చంపేస్తానని బెదిరించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరు యువకులు అత్యాచారం చేయడానికి మరో మహిళ కూడా సహకరించిందని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  భర్తను వదిలేసి పరారైన భార్య
  మధ్యప్రదేశ్ లో ఓ ఘటనలో విచిత్ర విషయం వెలుగు చూసిందీ ఘటన. మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ కు చెందిన మూర్తి రైక్వార్ కు.. ఉత్తరప్రదేశ్ లోని జలాన్ జిల్లా కు చెందిన రాహుల్ అనే యువకుడితో గతనెల 6న వివాహమైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశాడు రైక్వార్ తండ్రి. అయితే పెళ్లై 18 రోజులైన తర్వాత.. ఒక కార్యక్రమం నిమిత్తం రాహుల్, మూర్తి రైక్వార్లిద్దరూ రావలసిందిగా వధువు తండ్రి కోరాడు. ఆయన కోరిక నిమిత్తం వచ్చిన వారికి ఆ తండ్రి సపర్యలు చేశాడు. కొత్త అల్లుడికి ఏం లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. మరుసటి రోజు తాను ఇంటికి వెళ్లిపోతానని రాహుల్ చెప్పడంతో తాను రెండ్రోజుల తర్వాత వస్తానని మూర్తి చెప్పింది. దీంతో సరేనన్న రాహుల్.. ఒక్కడే జలాన్ కు వెళ్లిపోయాడు.

  రాహుల్ వెళ్లిన తర్వాత రైక్వార్ కూడా సాయంత్రం తన ప్రియుడితో పారిపోయింది. అదే గ్రామంలో ఉంటున్న భజ్జు యాదవ్ అనే వ్యక్తితో మూర్తికి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. అయితే పెళ్లికి ముందే వారిద్దరూ పారిపోవాలనుకున్నా అది కుదరలేదు. దీంతో ఇదే అదునుగా భావించిన వారిద్దరూ.. పెళ్లి తర్వాత పారిపోయారు. వెళ్లే సమయంలో ఆ నవ వధువు తనతో పాటు రూ. 5 లక్షల విలువైన బంగారం.. రూ. 20 వేల నగదు కూడా తీసుకెళ్లింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: