మహిళా సింగర్‌ను రేప్ చేసి...వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి...దారుణం...

ఈ క్రమంలోనే ఆ యువతి సెపరేట్ గా ఓ ఫ్లాట్ అద్దెకి తీసుకుంది. అయితే ఆమె ప్రియుడు టీవీ చానెల్ లో పనిచేసే యువకుడు, అతని స్నేహితుడుతో కలిసి మద్యం మత్తులో ఆమె ఉంటున్న గదికి వచ్చారు. ఆ తర్వాత ఆమెను తమ కోరిక తీర్చాలని పట్టుబట్టారు.

news18-telugu
Updated: November 3, 2020, 11:26 PM IST
మహిళా సింగర్‌ను రేప్ చేసి...వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి...దారుణం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పాకిస్థాన్ లోని కరాచీలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వర్థమాన గాయనిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను రేప్ చేస్తుండగా అతని మిత్రుడు ఆ ఘోరాన్ని వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోతో ఆ మహిళను దుండగులు మరిన్ని సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆ బాధితురాలు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. టెలివిజన్ షోస్ ద్వారా సింగర్ గా పరిచయం అయిన బాధితురాలు. అదే రంగంలో స్థిరపడేందుకు కరాచీ చేరుకుంది. ఓ హాస్టల్ లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. కాగా ఓ టీవీ చానెల్ లో పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఆ యువతి సెపరేట్ గా ఓ ఫ్లాట్ అద్దెకి తీసుకుంది. అయితే ఆమె ప్రియుడు టీవీ చానెల్ లో పనిచేసే యువకుడు, అతని స్నేహితుడుతో కలిసి మద్యం మత్తులో ఆమె ఉంటున్న గదికి వచ్చారు. ఆ తర్వాత ఆమెను తమ కోరిక తీర్చాలని పట్టుబట్టారు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెపై ఇద్దరూ కలిసి అత్యాచారం చేయగా, మరో వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీశాడు.

తర్వాత విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఆమెపై పలుమార్లు ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు. దీంతో వారి హింస నుంచి తప్పించుకొని చివకు తన స్వంత ఊరికి వెళ్లిన యువతి విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
Published by: Krishna Adithya
First published: November 3, 2020, 11:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading