చితక్కొట్టి మర్మాంగాలను తగులబెట్టారు..దోపిడీ దొంగల బీభత్సం

మార్గమధ్యలో వీరిని ఓ దొంగల ముఠా అడ్డగించింది. ఇద్దరిపై దాడిచేసి బలవంతంగా ఓ కారులోకి ఎక్కించారు. వారి వద్ద ఉన్న రూ.3800 నగదును లాక్కొని బట్టలు విప్పించారు. ఇరువురిని చితకబాది ఆ తర్వాత మర్మాంగాలకు నిప్పుపెట్టారు.

news18-telugu
Updated: May 22, 2019, 8:18 PM IST
చితక్కొట్టి మర్మాంగాలను తగులబెట్టారు..దోపిడీ దొంగల బీభత్సం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 8:18 PM IST
దోపిడీ దొంగల కిరాతకమిది..! దారిన పోతున్న ఇద్దరు వ్యక్తులను చితక్కొట్టి..వారి వద్ద ఉన్న డబ్బునంతా దోచేశారు. అంతటితో ఆగకుండా దుస్తులు విప్పించి మర్మాంగాలకు నిప్పుపెట్టారు. నగ్నంగా ఉన్న వారిద్దరిని కర్రలతో చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన విసిరేసి..అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కరమ్‌వీర్, అవినాశ్ వరసకు అన్నాదమ్ముళ్లు. మే 17న ఓ వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో వీరిని ఓ దొంగల ముఠా అడ్డగించింది. ఇద్దరిపై దాడిచేసి బలవంతంగా ఓ కారులోకి ఎక్కించారు. వారి వద్ద ఉన్న రూ.3800 నగదును లాక్కొని బట్టలు విప్పించారు. ఇరువురిని చితకబాది ఆ తర్వాత మర్మాంగాలకు నిప్పుపెట్టారు. కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా వినలేదు. కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వారిద్దరిని విసిరేసి..అక్కడి నుంచి పారిపోయారు.

మొత్తం తతంగాన్ని తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ వీడియో సికార్ ప్రాంతంలోని పలువురి మొబైళ్లలో షికారు చేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేశారు. సందీప్ నెహ్రా గ్యాంగే ఈ పని చేసినట్లుగా గుర్తించిన పోలీసులు..వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులకు ఇందులో హస్తముందని..త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...