విద్యార్థిని హత్యాచారం కేసులో ఇద్దరికి ఉరిశిక్ష

కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థినిపై సంతోష్‌, ప్రదీప్‌ అనే ఇద్దరు అత్యాచారానికి పాల్పడి, హతమార్చి బావిలో పడేశారు.

news18-telugu
Updated: January 19, 2020, 10:55 AM IST
విద్యార్థిని హత్యాచారం కేసులో ఇద్దరికి ఉరిశిక్ష
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ నిర్భయ ఘటనలో దోషులకు త్వరలోనే ఉరిశిక్ష అమలు కానుంది. రాష్ట్రపతి కూడా దోషుల క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఇటీవలే తెలంగాణ దిశా హత్యాచార కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కర్నాటక కోర్టు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. శృంగేరిలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి చిక్కమగళూరు జిల్లా కోర్టు ఇద్దరికి ఉరిశిక్ష విధిస్తూ శనివారం తీర్పు ఇచ్చింది. 2016 ఫిబ్రవరి 16న కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థినిపై సంతోష్‌, ప్రదీప్‌ అనే ఇద్దరు అత్యాచారానికి పాల్పడి, హతమార్చి బావిలో పడేశారు. ఈ కేసుపై నాలుగేళ్లుగా కోర్టులో సాగిన విచారణ ముగిసింది. నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉమేశ్‌ ఎం.అడిగ తీర్పును ప్రకటించారు. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అమ్మాయిలపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టినవాళ్లకు కోర్టులు కఠిన శిక్షలు వేయాలని కోరుతున్నారు.


First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు