TWO MEN BRUTALLY KILLED A LABOUR FOR CHICKEN LEGS AND INTESTINES IN PEDDAPALLI MS KNR
కోడి కాళ్లు, పేగుల కోసం బాబాయ్ నే హత్య చేసిన దుండగులు.. పెద్దపెల్లిలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
చికెన్, మటన్ కొనే స్థోమత లేకపోవడంతో తక్కువ ధరకు దొరికే కోడి కాళ్లు.. పేగులను తెచ్చుకుని దానినే చికెన్ బిర్యానీ అనుకుని తినేవాళ్లు. కానీ తనకు కోడి కాళ్ల కూర సరిగ్గా వేయడం లేదనే కోపంతో వరసకు బాబాయ్ అయ్యే వ్యక్తినే హత్య చేశాడో దుండగుడు.
వారంతా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడకు బతకడానికి వచ్చిన వలస కూలీలు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. కరోనా కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన ఆ అభాగ్యులు.. అక్కడ చేయడానికి పని దొరక్కపోవడంతో తిరిగి ఇక్కడకు చేరుకున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పెద్దపెల్లి జిల్లాలో ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. చికెన్, మటన్ కొనే స్థోమత లేకపోవడంతో తక్కువ ధరకు దొరికే కోడి కాళ్లు.. పేగులను తెచ్చుకుని దానినే చికెన్ బిర్యానీ అనుకుని తినేవాళ్లు. వారిలో అనేకులు వరుసకు అన్నాతమ్ములు.. వారి కొడుకులు.. అక్కా చెళ్లెల్లే.. కానీ తనకు కోడి కాళ్ల కూర సరిగ్గా వేయడం లేదనే కోపంతో వరసకు బాబాయ్ అయ్యే వ్యక్తినే హత్య చేశాడో దుండగుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో ఒడిషాకు చెందిన కార్మికులు భీమ్సన్ జోరా, పూజా లుంగియార్ స్థానికంగా ఉండే ఇటుక బట్టీలో కార్మికులుగా పనులు చేస్తున్నారు. వీరిద్దరూ వరుసకు తండ్రీ కొడుకులు. పూజా లుంగియాకు భీమ్సన్ బాబాయ్ వరుస అవుతారు. వీళ్లు తరుచూ గొడవ పడుతుండేవారు. అదే క్రమంలో ప్రతి గురువారం పెద్దపల్లిలో నిర్వహించే సంతలో కోడి కాళ్లు, పేగులు కొనుగోలు చేసి.. వండుకుని తినేవారు. ఇదే విషయంలో గురువారం వీరిద్దరూ గొడవ పడ్డారు. గొడవ జరుగుతుండగా.. అక్కడే ఉన్న భీమ్సన్ భార్య ఇరువురిని నివారించి గొడవ సద్దు మనిగేందుకు ప్రయత్నించింది. కానీ వాళ్లు మాత్రం మళ్లీ గొడవ పెట్టుకున్నారు. తరుచూ గొడవలకు బదులు... బసుజోరాను ఎలాగైనా చంపాలనుకున్నాడు పూజా లుంగియార్.
అనుకున్నదే తడువుగా.. మరో వ్యక్తితో కలిసి.. అతడిని చంపడానికి ప్రణాళిక వేసుకున్నారు. అటువైపుగా వెళ్లుతున్న భీమ్సన్ వెనకాల వెళ్లి.. రేకుల షెడ్డుపై ఉన్న కర్రతో తలపై ఒక్క వేటు వేశారు. దీంతో తీవ్రంగా గాయ పడ్డ భీమ్సన్ జోరా అక్కడే పడి గిలగిల కొట్టుకున్నాడు. పక్కన రక్తం పారుతున్నది. ఏం జరుగుతుందోనని భీమ్సన్ అనుకునే లోపే నిందితులు.. అతడిపై మరో రెండు వేట్లు వేశారు. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు.
తీవ్రంగా గాయపడిన బాధితుడిని గ్రామంలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు అతడి కుటుంబసభ్యులు. అతడిని తిరిగి ఇంటికి తీసుకెళ్లగా మరుసటి రోజు ఉదయం నిద్ర నుండి లేవకపోవడంతో బాధితుడి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వాళ్లు మళ్లీ గ్రామంలోని వైద్యుడికి చూపించగా... అతడు పెద్దపల్లి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవలసిందిగా సూచించాడు. ఆపై అతడిని పెద్దపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు.. బాధితుడి పరిస్థితి విషమయంగా ఉందని వెంటనే కరీంనగర్ కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్ కు తరలిస్తున్న క్రమంలో మార్గం మద్యలోనే భీమ్సన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు దాడి చేసిన విషయాన్ని కార్మికులు, ఇటుకబట్టి యాజమాన్యం బయటకు తెలియనీయకుండా కప్పి పుచ్చి.. అక్రమంగా మరణ దృవీకరణ పత్రం రాయించుకొని కరీంనగర్ లోని హిందూ స్మశాన వాటికలో మృతు దేహాన్ని తరలించి దహన సంస్కారాలు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు . ఈ ఘటనపై ఇతర ఇటుక బట్టీల వారి ద్వారా ఆనోటా ఈనోటా విషయం పోలీసుల వరకూ వెళ్లగా.. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులను, యాజమాన్యాన్ని నిలదీయగా వ్యవహారం మొత్తం బట్టబయిలైంది. హత్య చేసిన పూజా లుంగియార్, ఇతర వ్యక్తితో పాటు వివరాలను గోప్యంగా ఉంచిన మరికొంత మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.