విమానంలో టాయిలెట్ వినియోగానికి అనుమతి నిరాకరణ.. ఫిర్యాదు చేయడానికి వెళ్లి ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి విమానం ల్యాండింగ్ అవడానికి సిద్దమవుతున్న సమయంలో టాయిలెట్ వినియోగించడానికి వెళ్లగా.. అందుకు విమాన సిబ్బంది అభ్యంతరం తెలిపారు.

 • Share this:
  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిందితుల్లో ఒకరు కాంట్రాక్టర్ కాగా, మరోకరు ట్యాక్సీ డ్రైవర్. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. వైభవ్ చతుర్వేది(24) అనే వ్యక్తి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే విమానం ల్యాండింగ్ అవడానికి సిద్దమవుతున్న సమయంలో అతడు టాయిలెట్ వినియోగించడానికి వెళ్లగా.. అందుకు విమాన సిబ్బంది అభ్యంతరం తెలిపారు. దీంతో అతడు ఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అతని ఫిర్యాదు‌పై అధికారులు స్పందించకపోవడంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు.

  డీజీసీఏ ఉద్యోగులు తాగి ఉన్నారని అతడు భావించాడు. ఈ క్రమంలోనే అక్కడున్న ఇద్దరు అధికారులును అతడు కిడ్నాప్ చేశాడు. అనంతరం వారిలో ఒకరిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించాడు. అయితే పోలీసుల నుంచి ధ్రువీకరణ లేనిదే తాము వైద్య పరీక్షలు నిర్వహించలేమని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కిడ్నాప్‌కు గురైన ఓ ఉద్యోగి జనవరి 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  తాము మద్యం సేవించామని ఆరోపిస్తూ నిందితుడు తమను కిడ్నాప్ చేశాడని అతడు పోలీసులకు తెలిపాడు. ఇక, కిడ్నాప్ చేసిన ఉద్యోగులను నిందితుడు కోట్లా రెడ్ లైట్ ప్రాంతంలో విడిచి వెళ్లాడు. నిందితుడు వారికి తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. వారి ఐడీ కార్డ్స్, ఫోన్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

  దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. "వైభవ్ జనవరి 7న వైభవ్ గో ఎయిర్ ఫ్లైయిట్‌లో వారణాసి నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఆ సమయంలో టాయిలెట్‌కు సంబంధించిన విషయంలో అతనికి, విమాన సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ మరుసటి రోజు ట్యాక్సీలో వెళ్లి డీజీసీఏ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. అనంతరం అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసేందుకు ట్యాక్సీ డ్రైవర్‌ కూడా వైభవ్‌కు సహకరించాడు" అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: