Home /News /crime /

TWO MAOISTS WERE KILLED IN A SHOOTOUT BETWEEN SECURITY FORCES AND MAOISTS IN A FOREST AREA UNDER DURDA IN BIJAPUR DISTRICT OF CHHATTISGARH STATE KMM PRV

Two Maoists dead: భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దండకారణ్యంలో భద్రతా బలగాలు (Security forces), మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు (Counterattacks) జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు (Two Maoists dead) మృతిచెందినట్లు సమాచారం

    ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో భద్రతా బలగాలు (Security forces), మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు (Counterattacks) జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు (Two Maoists dead) మృతిచెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దుర్దా పరిధిలోని అటవీ ప్రాంతంలో (Durda in Bijapur district of Chhattisgarh state) డీఆర్జీ, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఉదయం సుమారు 6 గంటల సమయంలో బలగాలకు Security forces) మావోయిస్టులు తారసపడి కాల్పులకు (Firing) దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు (Maoists) కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. ఇరువర్గాల మధ్య సుమారు ఇరవై నిమిషాల పాటు భీకర పోరు జరిగినట్లు తెలుస్తోంది.

    ఆయుధ, వస్తు, సామగ్రి స్వాధీనం..

    కాల్పుల విరమణ అనంతరం భద్రతా బలగాలు (Security forces) ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపులు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఘటనాస్థలంలో ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు మహిళా మావోయిస్టుల (Two Maoists dead)  మృతదేహాలతో పాటు ఆయుధ, వస్తు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీన పర్చుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బీజాపూర్ పోలీస్ ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

    ప్రజాకోర్టు నిర్వహించి, హెచ్చరికలతో..

    అంతకు ముందు గత నవంబరులో చత్తీస్‌ఘడ్‌ బీజపూర్‌ జిల్లా పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అజయ్‌ రోషన్‌ లక్రాను రోడ్ల నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుండగా మావోయిస్టులు కిడ్నాప్‌ (Kidnapped by Maoists) చేశారు. అతని భార్య వేడుకోలు అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి, హెచ్చరికలతో వదిలారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి తెలంగాణ- చత్తీస్‌ఘడ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

    మావోయిస్టుల లొంగుబాట్లు చోటుచేసుకుంటున్నా..

    ఎప్పటికప్పుడు కూంబింగ్‌లతో మావోయిస్టులను నియంత్రించే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ.. అడపా దడపా ఎదురుకాల్పులు.. అనంతరం మావోయిస్టుల లొంగుబాట్లు.. చోటుచేసుకుంటున్నా ఉద్యమ విస్తరణ మాత్రం ఆగిపోలేదన్న సంకేతాలను మావోయిస్టులు పంపుతునే ఉన్నారు.

    Traffic challan Telangana: వాహనదారులకే కాదు.. వారికి కూడా పోలీసు శాఖ బంఫర్​ ఆఫర్​.. రూ. 100 చెల్లిస్తే ఆ చలాన్ కూడా మాఫీ..

    ఎక్కడో ఏజెన్సీలో అటవీ ప్రాంతంలోనే తమ కార్యకలాపాలకు పరిమితం అయిన మావోయిస్టులు ఇప్పుడు ఇలా మైదాన ప్రాంతంలోకి చొచ్చుకుని రావడం, ఒక మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ సర్పంచిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించడం నిజానికి తేలిగ్గా తీసుకునే విషయం కాదు. దీనిపై సీరియస్‌గా స్పందించిన పోలీసులు వచ్చినవాళ్లు ఎవరు..? ఒకవేళ మావోయిస్టులే అయితే వాళ్లు ఇంత లోపలికి ఎలా రాగలిగారు అన్నది తేల్చే పనిలో ఉన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Chatisghad, Encounter, Khammam, Maoist, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు