ఓ మహిళ.. ఒక భర్త.. ఇద్దరు ప్రియులు.. చివరకు ఆమె గర్భం దాల్చడంతో ఇక అక్కడ రచ్చ రచ్చ.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

Tragedy Story: పెళ్లైన స్త్రీ గర్భం దాల్చితే ఆమెతో పాటు తన భర్త కూడా ఎంతో సంతోషిస్తారు. ఇక్కడ తన భార్య గర్భవతి అని తెలిసి భర్త ఎంతో సంతోషించాడు. కానీ అంతలోనే ఆమె దగ్గరకు ఇద్దరు ప్రియులు వచ్చారు. ఆ బిడ్డకు తండ్రి నేనంటే నేను అంటూ వాగ్వాదానికి దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఎంతో మంది వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినప్పటికీ దాని ఫలితాలు, పర్యవసానాలు ఎన్నో జీవితాలతో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. కొన్ని నిమిషాల ఆనందం కోసం జీవితాన్ని, కుటుంబాన్నే ఫణంగా పెడుతున్నారు. ఇలాంటి ప్రతి సంబంధం చివరికి క్రైంతోనే ముగిసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఒకటి... రెండు కాదు.. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు జరిగాయి. వీటివల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. నిత్యం ఎన్ని ఘటనలు చూస్తున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండడం లేదు.

  ఒక్క ముద్దుకు రూ.25 వేలు.. 5 నెలలపాటు ఆ ఖర్చులు కూడా.. ఆ మహిళకు ఆఫర్ ఇచ్చిన గ్రామస్తుడు.. వివరాలిలా..


  తప్పు చేసి తలదించుకోవాల్సిన సమయంలోనూ తలెగరేస్తున్నారు. న్యాయం కావాలంటూ పోరాటాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. పుట్టబోయే బిడ్డపై పూర్తి హక్కులు తన భర్తకు ఉంటాయి. కానీ ఇక్కడ తన భర్త కాకుడా మరో ఇద్దరు వచ్చి ఆ బిడ్డ కోసం పోట్లాడటం మనం ఎక్కడైనా చూశామా.. భార్యభర్తలు విడిపోయిన సందర్భంలో మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. తల్లిదగ్గర లేదా తండ్రి దగ్గర ఉండాలనే తీర్పును కోర్టు చెబుతుంది.

  Telangana Crime: రాత్రి అన్నం తిని పడుకుంది.. తెల్లారి లేచేసరికి ఆ యువతి కనిపించలేదు.. అసలేం జరిగింది..


  కానీ ఇక్కడ వింతగా భర్తతో ప్రమేయం లేకుండా ఇద్దరు ప్రియులు వచ్చి కొట్టుకోవడం చాలా విచిత్రంగా అనిపించింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుని అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇదంతా కలికాలం అంటూ అంటున్నారు. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్తి తెలుసుకుందాం.. తమిళనాడు సేలం జిల్లా అయోధ్య నగరం రామ్‌నగర్‌ కాలనీకి చెందిన మురుగేశన్‌ రెండో భార్య కలైమణి. అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్‌, కృపై రాజ్‌ తో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

  Hyderabad News: ఊదమంటే.. దాన్నిపట్టుకొని ఉడాయించాడు.. ఏం జరిగిందంటే..


  ఆమె గర్భవతి అయింది. ఈ శుభవార్త విని భర్త మురుగేశన్ సంతోషించాడు. ఆమె గర్భవతి అని తెలిసిన సందర్భంలో ఇద్దరు ప్రియులకు కూడా చెప్పింది. ఆమె ఇలా వస్తారని ఊహించి ఉండదు. ఇద్దరు ఒకే సమయంలో ఇంటికి వచ్చి.. ఒకర్నొకరు చూసుకుని కలైమణి కడుపులో బిడ్డకి తండ్రిని తానంటే తానని వాదించుకున్నారు. దీంతో వారు ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. కలైఅరసన్‌ కత్తితో కృపైరాజ్‌పై దాడి చేసి చంపేశాడు.

  New Traffic Rule: వాహనదారులకు ముఖ్య గమనిక.. హెల్మెట్ పై ఈ గుర్తు తప్పనిసరి.. లేదంటే భారీ జరిమానా.. పూర్తి వివరాలివే..


  ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్‌‌ను అరెస్టు చేసి కేసునమోదు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం చర్చనీయాంశమైంది.
  Published by:Veera Babu
  First published: