Two Terrorists Killed : జమ్ముకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. శ్రీనగర్ లోని జకూరా ప్రాంతాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే పక్కా సమాచారంతో శనివారం భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా(LeT)కు చెందిన ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్మూకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
చనిపోయిన వారి నుంచి రెండు పిస్టల్స్ సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్ కౌంటర్ లో హతులైన ఇద్దరిలో ఒకరిని ఇఖ్లాక్ హజామ్గా గుర్తించారు. జనవరి 29 అనంత్ నాగ్ లో పోలీస్ అధికారి హెచ్.సీ అలీ మహ్మద్ హత్యలో హజామ్ ప్రమేయం ఉన్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Encounter, Jammu kashmir, Kashmir security, Terrorists