హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఓ చెట్టు.. రెండు పులులు.. ముగ్గురు యవకులు.. కట్ చేస్తే ఇద్దరిని అడవిలోకి లాక్కెళ్లిన పులులు.. మరి మూడో వ్యక్తి..? వివరాలివే..

ఓ చెట్టు.. రెండు పులులు.. ముగ్గురు యవకులు.. కట్ చేస్తే ఇద్దరిని అడవిలోకి లాక్కెళ్లిన పులులు.. మరి మూడో వ్యక్తి..? వివరాలివే..

ఘటనా స్థలంలో పోలీసులు (Image credit : twitter)

ఘటనా స్థలంలో పోలీసులు (Image credit : twitter)

Two Tigers Attack: అడవిలోకి ఒకే వాహనంపై ముగ్గురు కుర్రాళ్లు వెళ్తున్నారు. వాళ్లకు రెండు పులులు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే వారిపై అమాంతం దూకగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో వ్యక్తి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడో తెలుసా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

వారు ముగ్గురు స్నేహితులు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారు. ఎక్కడ కూర్చున్నా సరదా సరదాగ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఓ రోజు ఒకే బైక్ పై అడవిలోకి వెళ్లాలనుకున్నారు. ముగ్గరు సరదాగా అలా మాట్లాడుకుంటూ.. నవ్వుకుంటూ వెళ్తుండగా.. సడన్ గా వారి ఎదురుగా రెండు పులులు కనిపించాయి. దీంతో బైక్ నడిపే వ్యక్తి  బ్రేక్ వేసి బండిని ఆపాడు. ఆ పలులు వీళ్ల ముగ్గురిని ఆకలితో చూస్తున్నట్లు చూస్తున్నాయి. ఇక ఆ సమయంలో వాళ్ల పరిస్థితి ఘోరం. ఏం చేయాలో తెలియక బైక్ నడుపుతున్న కుర్రాడు బైక్ ను వెనక్కి తిప్పుతుండగా సడన్ గా ఒక పులి వచ్చి అతడిపై దాడి చేసింది. దీంతో  మిగిలిన ఇద్దరు వ్యక్తులు ప్రాణ భయంతో పరుగు పెట్టారు. అవి పులులు వాటి బారి నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టం. బైక్ నడిపే వ్యక్తిని గాయపర్చి ఆ ఇద్దరి వ్యక్తులను ఆ పులులు వెంబడించాయి. పక్కనే ఉన్న ఓ చెట్టును ఎక్కేందుకు ప్రయత్నించారు. బైక్ చివరన కూర్చున్న వ్యక్తి ఎక్కిన తర్వాత బైక్ మధ్యలో కూర్చున్న వ్యక్తి ఆరడుగులు ఎక్కే సరికి పులి అతడిని అందుకుంది.

ఆ చెట్టుపైనుంచి కిందకు పడిపోయిన ఆ కుర్రాడిని ఆ పులులు నోటితో లాక్కుంటూ తీసుకెళ్లాయి. ఈ దృశ్యాన్ని చెట్టుపై ప్రాణ భయంతో దాచుకున్న ఆ వ్యక్తి చూసి వణికిపోయాడు. తనతో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితులను పులులు వారి దేహాలపై దాడి చేసి చంపడం కళ్లారా చూసి నివ్వెరపోయాడు. అతడి భయం అంతకు అంత రెట్టింపు అయింది. అక్కడే ఉన్న రెండు పులులు అతడిని కూడా చంపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆ చెట్టును ఎక్కేందుకు ప్రయత్నించినా వాటికి కుదరలేదు. అతడు అదే చెట్టుపై దాదాపు ఎనిమిది గంటలు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని చెట్టుపైనే ఉన్నాడు. రాత్రంతా ఏమాత్రం కునుకు లేకుండా అక్కడే ఉన్నాడు. కింద రెండు పులులు మాత్రం అతడి కోసం నిరీక్షిస్తున్నట్లు చూస్తూనే ఉన్నాయి. ఉదయం అయ్యే సరికి అవి అక్కడ నుంచి వెళ్లి పోయాయి. అయినా అతడు అక్కడ నుంచి దిగలేదు. ఇదంతా సినిమా స్టోరీలా అనిపించొచ్చు కానీ ఇది నిజంగానే జరిగింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిట్ ప్రాంత పరిధిలోని ఖర్నౌట్ నదీ పరివాహ ప్రాంతంలోని అటవీ పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మూడో వ్యక్తి మాత్రం ఎలాగోల పులుల బారి నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. అతడిని దీనిపై వివరాలను అడగ్గా ఇలా చెప్పాడు. నేను(వికాస్), సోను, కాందైలాల్ స్నేహితులం. ఓ రోజు బైక్ పై అడవి గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అడవిలోకి వెళ్తున్న సమయంలో అక్కడ అధికారులు ఇటు నుంచి వెళ్లకండి.. పులులు ఉంటాయని జాగ్రత్తలు చెప్పినా ఏ మాత్రం వినిపించుకోలేదన్నాడు. సోను బైక్ నడుపుతుండగా.. కాందైలాల్ మధ్యలో కూర్చున్నాడు. తాను బైక్ చివరన కూర్చున్నట్లు తెలిపాడు. కొద్ది దూరం వెళ్లే సరికి తమకు రెండు పులులు ప్రత్యక్షమయ్యాయని తెలిపాడు. వాటి నుంచి తప్పించుకుందామని ప్రయత్నించాం. కానీ కుదరలేదు. అవి మా మీద దాడి చేశాయి. నేను చూస్తుండగానే సోనును, కాందైలాల్‌ను ఆ పులులు చంపేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు.

తాను అదృష్టవశాత్తు పక్కనే ఓ చెట్టును ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపాడు. తాను చెట్టుపైనే ఉండి కింద ఆ పులులు ఏం చేస్తున్నాయో చూశాన్నారు. అక్కడ కనిపించిన దృశ్యం ఇప్పటికి తన కళ్ల ముందే మెదులుతుందన్నారు. చూస్తుండగానే అందులో ఒక స్నేహితుడి దేహాన్ని ఒక పులి అడవిలోకి తీసుకెళ్లాయని చెప్పాడు. తనను చంపేందుకు పులులు ప్రయత్నిచాలయని.. కానీ వీలు కాలేదని తెలిపాడు. ఈ ఘటన సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో జరగ్గా.. అప్పటి నుంచి రాత్రంతా చెట్టుపైనే ఉన్నట్లు తెలిపాడు. చివరకు ఉదయం 3.30గంటల సమయంలో ఆ పులులు వెళ్లిపోయాయి. అయినా తాను వెంటనే కిందకు దిగలేదన్నాడు. ఉదయం 6 గంటల సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు వెళ్తుంటే.. కాపాడండి అంటూ అరిచి వాళ్లను పిలిచినట్లు తెలిపాడు. వాళ్ల సాయంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్పాడు. జరిగినది అంతా అక్కడే ఉన్న అటవీ పోలీసు అధికారులకు వెల్లడించినట్లు తెలిపాడు. పోలీసులు అందులోని ఒక మిత్రుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ కిరిటి కుమార్ రాథోడ్ తెలిపారు.

First published:

Tags: Crime, Crime news, Tigers

ఉత్తమ కథలు