Vienna Terror Attack: వియన్నాలో రెచ్చిపోయిన ముష్కరులు.. ఇద్దరు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Vienna Terror Attack: ఇటీవల ప్రపంచ దేశాల్లో జరిగిన కాల్పుల ఘటనలు మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వియన్నాలో పలువురు దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

news18
Updated: November 3, 2020, 8:58 AM IST
Vienna Terror Attack: వియన్నాలో రెచ్చిపోయిన ముష్కరులు.. ఇద్దరు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 3, 2020, 8:58 AM IST
  • Share this:
ఇటీవల ప్రపంచ దేశాల్లో జరుగుతున్న కాల్పుల ఘటనలకు సంబంధించిన విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితమే ఫ్రాన్స్ లో పలువురు దుండగులు ముగ్గురిని కాల్చి చంపగా.. సోమవారం అఫ్ఘనిస్తాన్ లో ఒక ఉగ్రవాది జరిపిన కాల్పులలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలన్నీ కళ్లముందు మెదులుతుండగానే.. ఆస్ట్రియా దేశంలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ వియన్నాలోని పలు భవనాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. వాటిపై వంద రౌండ్ల దాకా కాల్పులు జరిపినట్టు సమాచారం.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆస్ట్రియా దేశంలోని సెంట్రల్ వియాన్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగినట్టు తెలుస్తున్నది. ముష్కరులు జరిపిన దాడిలో ఇద్దరు మరణించారని వియాన్నా అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయని.. మరికొంతమందిని ఆస్పత్రికి తరలించామని వారు తెలిపారు. దుండగులు ఎక్కువ రౌండ్లు కాల్పులు జరిపినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు చెబుతున్నారు.

దాడికి పాల్పడ్డ ముష్కరులంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ గా అనుమానిస్తున్నారు. వారంతా పరారీలో ఉన్నట్టు వియన్నా మేయర్ మైఖెల్ లుడ్విగ్ తెలిపారు. ఆరు ప్రదేశాలలో ఉన్న అపార్ట్మెంట్ లలో ముష్కరులు దాడికి పాల్పడ్టట్టు ఆయన వివరించారు.
కాగా ఈ దాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. యూరప్ ను విచ్చిన్నం చేసే ఏ కుట్రనూ సహించబోమని.. యూరోపియన్ యూనియన్ తెలిపింది. ఇటీవల ప్రాంతాల్లో యూరప్ లోని పారిస్, బెర్లిన్, లండన్ లలో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలని వారు ఆకాంక్షించారు.






ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రాస్ స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఆస్ట్రియా ప్రజలకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడుతున్న జో బిడెన్ కూడా ఆస్ట్రియా ప్రజలకు సంఘీబావాన్ని ప్రకటించారు.
Published by: Srinivas Munigala
First published: November 3, 2020, 8:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading