• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO KILLED AND 15 INJUIRED IN ROAD ACCIDENT NEAR JANGAREDDY GUDEM OF WEST GODAVARI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుడికి బయలుదేరిన కొద్దిసేపటికే విషాదం

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుడికి బయలుదేరిన కొద్దిసేపటికే విషాదం

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: ఆదివారం కావడంతో వారంతా అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. కూలీలు కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు ట్రాక్టర్లో బయలుదేరారు.

  • Share this:
    ఆదివారం కావడంతో వారంతా అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. కూలీలు కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు ట్రాక్టర్లో బయలుదేరారు. కానీ మొక్కులు తీర్చుకునేలోపే రోడ్డు ప్రమాదం వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. వివగాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం వద్ద ట్రాక్టర్ బోల్తా పడటంతో 22 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో కొంతమంది పరిస్థి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. రాంబాబు (50), సాక్ష (2) ఆస్పత్రికి తరలిస్తుంటగా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డవారిలో 15 మందిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.

    బాధితులు కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో గుబ్బలమంగమ్మ తల్లి ఆలయానికి మూడు ట్రాక్టర్లలో బయలుదేరారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డులోని శ్రీనివాసాపురం జంక్షన్ వద్దకు చేరుకోగానే.. రామండ్రి నుంచి ఖమ్మం వెళ్తున్న లారీ మెయిన్ రోడ్డుమీకు వస్తూ ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. దీంతో ఇంజన్, ట్రక్కు విడిపోవడంతో బోల్తాపడింది. లారీ ఢీకొట్టిన ధాటికి ట్రక్కు వంద గజాల దూరంలో పడింది. దీంతో ట్రక్కులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు.

    స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. పొంగమంచు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దైవదర్శనానికి బయలుదేరిన వారు ప్రమాదానికి గురవడంతో కూలీలంతా షాక్ కు గురయ్యారు.

    ఇటీవల  ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద హైవేపై ప్రమాదం జరిగింది. వ్యాన్ వేగంగా వెళ్తున్న సమయంలో డోర్ తెరుచుకోవడంతో రోడ్డుపై పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం అర్జాపురం గ్రామానికి చెందిన 25 మంది కూలీలు.. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని మిరప పొలాల్లో పనిచేసేందుకు బొలేరో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో వ్యాన్ నారాయణపురం వద్దకు చేరుకోగానే.. వ్యాన్ డోర్ తెరుచుకుంది. ఒక్కసారిగా డోర్ తెరుచుకోవడం, వ్యాన్ వేగంగా వెళ్తుండటంతో డోర్ కు ఆనుకొని నిద్రిస్తున్న ఆరుగురు ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో తీవ్రగాయాలైన ఇద్దరు స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడ్డవారిని స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు