• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO KILLED A MAN IN SUSPECT OF ILLEGAL AFFAIR WITH WIFE BA MDK

Sangareddy: తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానం.. అర్ధరాత్రి డిగ్రీ కాలేజీలో...

Sangareddy: తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానం.. అర్ధరాత్రి డిగ్రీ కాలేజీలో...

ప్రతీకాత్మక చిత్రం (image from youtube)

తన భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి మీద దాడి చేశారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ ఘటన జరిగింది.

  • Share this:
    తన భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి మీద దాడి చేశారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ ఘటన జరిగింది. స్థానిక డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు కొత్ల పూర్ గ్రామానికి చెందిన శివ గోని రవీందర్ గౌడ్(28) ఈ నెల 5న దాడిచేశారు. చుట్టుపక్కల వారు గుర్తించి చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల7న రవీందర్ గౌడ్ మృతి చెందాడు. సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపగా.. హత్య చేసినట్టు తేలింది. ఈ సంఘటనలో మహమ్మద్ షేక్ బర్కతుల్లా (38), మహమ్మద్ రియాజ్ (30 )అనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ మంగళవారం తెలిపారు.శివగోని రవీందర్ గౌడ్ కు షేక్ మహబూబ్ భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానం ఉంది. దీంతో తట్టుకోలేకపోయాడు.

    ఈ నెల 5న రాత్రి ద్విచక్ర వాహనంపై రవీందర్ గౌడ్ వెళుతుండగా మహమ్మద్ షేక్ బర్కతుల్లా, తన స్నేహితుడైన మహమ్మద్ రియాద్ ద్వారా రవీందర్ గౌడ్‌ను ఫోన్ చేసి పిలిపించాడు. అతని సహాయంతో రవీందర్‌ను ఆటోలో తీసుకుని వెళ్లాడు. తార డిగ్రీ కళాశాల గ్రౌండ్ ప్రాంగణంలో రవీందర్ గౌడ్ మీద కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు. ఆ దెబ్బలకు చనిపోయాడని భావించి రవీందర్ గౌడ్‌ను అక్కడ వదిలి వెళ్ళిపోయారు. అయితే, బాధితుడు కొనఊపిరితో ఉండగా చుట్టుపక్కల వారు గుర్తించి సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స నిమిత్తం ఉస్మానియా తిరిగి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణలో భాగంగా, సీసీ కెమెరాలో పరిశీలించి అనుమానం ఉన్న ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని విచారించగా హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. హత్యకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: