హోమ్ /వార్తలు /క్రైమ్ /

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల దుర్మరణం..

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల దుర్మరణం..

వారు ప్రయాణిస్తున్న వాహనం వైరా దగ్గర ప్రమాదానికి గురైంది.

వారు ప్రయాణిస్తున్న వాహనం వైరా దగ్గర ప్రమాదానికి గురైంది.

క్రిస్‌మస్ పండుగ రోజే దారుణం జరిగింది. దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.

    క్రిస్‌మస్ పండుగ రోజే దారుణం జరిగింది. దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. క్రిస్మస్ పార్టీని పూర్తి చేసుకొని రూమ్‌కు తిరిగి వెళ్తుండగా కేరళకు చెందిన రోహిత్ కృష్ణకుమార్ (19), శరత్ కుమార్ (21) ప్రమాదానికి గురై, అక్కడికక్కడే మరణించారు. కృష్ణకుమార్ యూకేలో, శరత్ కుమార్ యూఎస్‌లో చదువుతున్నాడు. వీరిద్దరూ అంతకుముందు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఇండియాకు వచ్చిన వారిద్దరు తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఇంతలో ఘోరం జరిగింది. సరదాగా గడుపుదామని దుబాయ్‌కి వస్తే దుర్మరణం జరగడంతో వారి కుటుంబాలను విషాదంలోకి నెట్టాయి.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Dubai, India, Road Accident

    ఉత్తమ కథలు