ప్రధాని మోదీ కుటుంబసభ్యురాలి పర్సు చోరీ..

ఆ బ్యాగ్‌లో దమయంతి ఆధార్ కార్డు, రూ.56వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఇతరత్రా కొన్ని పత్రాలు ఉన్నట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: October 12, 2019, 2:45 PM IST
ప్రధాని మోదీ కుటుంబసభ్యురాలి పర్సు చోరీ..
దమయంతి, ప్రధాని మోదీ
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడి కుమార్తె పర్సును ఇద్దరు దొంగలు కొట్టేశారు. ఢిల్లీలో ఈ దొంగతనం జరిగింది. నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుమార్తె దమయంతి అమృత్ సర్ నుంచి ఢిల్లీ వచ్చారు. హస్తినలో ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చి ఆమె బ్యాగ్‌ను లాక్కెళ్లిపోయారు. ఆ బ్యాగ్‌లో దమయంతి ఆధార్ కార్డు, రూ.56వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఇతరత్రా కొన్ని పత్రాలు ఉన్నట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ తమ్ముని కుమార్తె పర్సు కొట్టేయడం హస్తినలో సంచలనం రేపింది. అయితే, తాము ఈ విషయాన్ని ప్రధాని వరకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదని ప్రహ్లాద్ మోదీ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తమ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని, మిగిలిన విషయాలు వారు చూసుకుంటారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీకి చెప్పాల్సినంత అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు దమయంతి కూడా ఇదే విషయాన్ని తెలిపారు. తాము సాధారణ పౌరుల్లాగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని తెలిపారు.

బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading