మైనర్ అమ్మాయిలపై 6 నెలలుగా రేప్... పని ఇప్పిస్తామని చెప్పి...

పని కల్పిస్తానని చెప్పి ఇద్దరు మైనర్ యువతలను జార్ఖండ్ నుంచి రాజస్థాన్ తీసుకెళ్లిన ఓ కాంట్రాక్టర్... మరో ముగ్గురితో కలిసి వారిపై ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: May 22, 2019, 8:33 PM IST
మైనర్ అమ్మాయిలపై 6 నెలలుగా రేప్... పని ఇప్పిస్తామని చెప్పి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 8:33 PM IST
ఇద్దరు మైనర్ అమ్మాయిలపై ఆరు నెలలుగా నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల వయసులోపు ఉన్న ఇద్దరు అమ్మాయిలపై ఇద్దరు మైనర్ యువకులు సహా నలుగురు ఆరు నెలల నుంచి లైంగికంగా వేధించారు. రాజస్థాన్‌లోని బిల్వారాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొంటూ అనే ఓ కాంట్రాక్టర్ జార్ఖండ్‌లోని దల్తాన్‌గంజ్ ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలకు రాజస్థాన్‌లో పని కల్పిస్తానని నమ్మించాడు. వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో పాటు వారికి ముందుగానే రూ. 4 వేల రూపాయలు ఇచ్చాడు.

అలా రాజస్థాన్‌లోని బిల్వారాలోని ఓ ఫ్యాక్టరీలో మైనర్ యువతులను పనిలో పెట్టించిన మొంటూ.. వారితో రోజుకు 16 గంటల పాటు పని చేయించుకుని తిండి కూడా సరిగ్గా పెట్టలేదని బాలల సంరక్షణ కమిటీ తేల్చింది. అంతేకాదు తన స్నేహితుడైన చంద్రకాంత్‌ మరో ఇద్దరు మైనర్ యువకులు కలిసి ఈ ఇద్దరు అమ్మాయిలపై ఆరు నెలల పాటు ఫ్యాక్టరీలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. వారిద్దరిని కనీసం తమ తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు. ఈ నలుగురు యువకులు పార్టీ చేసుకుని తప్పతాగిన సమయంలో ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోయి రైలు ఎక్కారు. అక్కడ ఓ వ్యక్తి వీళ్లు చెప్పిన విషయాలు విని... భోపాల్‌లోని బాలల సంరక్షణ కమిటీ దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. మైనర్ అమ్మాయిలను తమ సంరక్షణలోకి తీసుకున్న బాలల సంరక్షణ కమిటీ మింటూ, చంద్రకాంత్ సహా నలుగురు యువకులపై ఫిర్యాదు చేసింది.


First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...