మరో వివాదంలో స్వామి నిత్యానంద..

తమ ఇద్దరు కూతుళ్లను నిత్యానంద ఆశ్రమం నిర్వాహకులు నిర్భందించారంటూ జనార్ధన శర్మ దంపతులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

news18-telugu
Updated: November 19, 2019, 11:47 AM IST
మరో వివాదంలో స్వామి నిత్యానంద..
నిత్యానంద(ఫైల్ ఫోటో)
  • Share this:
స్వామి నిత్యానంద చుట్టూ మరో వివాదం నెలకొంది. ఆయన తన ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతుళ్లను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. తమ ఇద్దరు కూతుళ్లను తమకు అప్పగించాలని కోరుతూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. జనార్థన శర్మ దంపతులు తమ దంపతులను 2013లో వీరిని బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్‌లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు.

విషయం తెలుసుకున్న వీరు తమ కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా... సర్వఙ్ఞాన పీఠ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో శర్మ దంపతులు ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన శర్మ దంపతులు.. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading