HOME » NEWS » crime » TWO GIRLS HAVE BEEN RESCUED FROM PROSTITUTION BUSINESS IN CHIPLUN RATNAGIRI OF MAHARASHTRA NK

Sex Racket: సెక్స్ రాకెట్ ఉచ్చులో ఇద్దరు యువతులు... రక్షించిన స్వచ్ఛంద సంస్థ

Sex Racket: పల్లెల్లో ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న ముఠాలు... వారిని సిటీకి రప్పించి... వ్యభిచార కూపంలోకి దింపేందుకు యత్నిస్తున్నాయి. ఈ కేసులో ఏం జరిగింది?

news18-telugu
Updated: November 29, 2020, 6:51 AM IST
Sex Racket: సెక్స్ రాకెట్ ఉచ్చులో ఇద్దరు యువతులు... రక్షించిన స్వచ్ఛంద సంస్థ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది పశ్చిమ బెంగాల్. అక్కడి ఖేర్డీలో ఓ కూరగాయల వ్యాపారి ఉన్నాడు. పేరు మహ్మద్ వసీం దువాభక్ష్ షేక్. పేరుకి అతను చేసేది కూరగాయల వ్యాపారమే కానీ... తెరవెనక పెద్ద సెక్స్ రాకెట్ దందా నడిపిస్తున్నాడు. అతనికి ముంబైలోని సెక్స్ రాకెట్ ముఠాలతో సంబంధాలున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కూరగాయల వ్యాపారం చేస్తాడు. మధ్యాహ్నం దుకాణం సర్దేసి... సిటీ అంతా తిరుగుతాడు. ఎక్కడైనా అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తారేమోనని వెతకుతాడు. పల్లెల నుంచి ఉద్యోగాల కోసం సిటీలకు యువతులు రావడం సహజమే కదా... అలాంటి వాళ్లను వసీం వెతుకుతాడు. ఏ ఉద్యోగం చేస్తారు... ఎంత శాలరీ కావాలి... ఇలా పెద్ద మనిషిలా బిల్డప్ ఇస్తూ... వివరాలు అడుగుతాడు. అలాంటి ఉద్యోగాలు బెంగాల్‌లో లేవనీ... ముంబైలో ఉన్నాయని చెబుతాడు. అక్కడైతే... ఇంకా ఎక్కువ శాలరీ వస్తుందని ఆశ చూపుతాడు. అమాయక అమ్మాయిలు నిజమేనని నమ్మి అతనితో ముంబై వెళ్తారు.

తాజాగా ఇద్దరు యువతులను అక్టోబర్‌లో వసీం... ముంబై తీసుకొచ్చాడు. సిటీకి శివారులోని ఓ బూతు బంగళా లాంటి దానికి తీసుకెళ్లాడు. ఇదేంటి అంటే... సిటీలో అయితే... అద్దెలు ఎక్కువ కాబట్టి... ఇక్కడ ఉంటూ... ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వొచ్చని చెప్పాడు. ఆ యువతులు సరే అన్నారు. 2 రోజులు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వమని చెప్పాడు. సరే అన్నారు. రెండ్రోజుల తర్వాత... వాళ్లను ఇంటర్వ్యూకి తీసుకెళ్లలేదు. ఇక అప్పటి నుంచి వాళ్లను అక్కడే ఉంచి... సెక్స్ రాకెట్‌లో చేరమని డిమాండ్ చేయసాగాడు. తాము అలాంటి వాళ్లం కాదనీ... తమను వదిలేయమని ఆ యువతులు బతిమలాడారు. వింటేగా... రోజూ వాళ్లను చితక బాదుతున్నాడు. తన మాట వినాల్సిందే అని టార్చర్ పెడుతున్నాడు.

ఆ బంగ్లాకి దగ్గర్లో ఓ యువకుడు రోడ్డుపై వెళ్తుండగా... చెప్పు తెగింది. దాంతో అక్కడ ఆగి చెప్పును సరిచేసుకుంటుంటే... అమ్మాయిల ఏడుపులు, అరుపులూ వినిపించాయి. దాంతో అక్కడ ఏదో జరుగుతోందని గ్రహించి... హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ వారికి కాల్ చేసి చెప్పాడు. వాళ్లు వెంటనే పోలీసులతో వచ్చి... బంగ్లాపై రైడింగ్ చేశారు. దాంతో... బజ్జీలు తింటున్న వసీం పోలీసులకు దొరకాడు. ఓ గదిలో మూలన కూర్చొని ఏడుస్తున్న యువతులను పోలీసులు రక్షించారు. వసీంకి నాలుగు తగిలించి... అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ మరో నాలుగు వడ్డించాక... పైన చెప్పిందంతా చెప్పాడు. తాను ఈ రాకెట్ లోకి దిగడం ఇదే మొదటిసారి అని చెప్పాడు. పోలీసులు నమ్మలేదు. దీని వెనక పెద్ద రాకెట్టే ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Post Office RD Scheme: నెలకు రూ.10,000 సేవ్ చేస్తూ... రూ.16 లక్షలు పొందండి

బెంగాల్ పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది. అక్కడ వ్యభిచారానికి చట్టబద్ధత ఉంది. దురదృష్టం కొద్దీ బెంగాల్‌లో చాలా మంది యువతుల్ని ఉద్యోగం పేరుతో బంగ్లాదేశ్ తీసుకెళ్లి... వ్యభిచార కూపాల్లో దించుతున్నారు. అలా కాదంటే... ఇలా వసీం లాంటి వాళ్లు... ముంబైకి తెచ్చి ముంచుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: November 29, 2020, 6:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading