Home /News /crime /

TWO FRIENDS TRIED TO POUR PETROL ON A YOUNG MAN AND SET HIM ON FIRE NEAR ERRAGADDA MENTAL HOSPITAL SR NAGAR IN HYDERABAD PRV

Shocking Incident: హైదరాబాద్​లో దారుణం.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన స్నేహితులు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో యువకులు భీభత్సం సృష్టించారు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి గ్రౌండ్‌లో ఆదిల్ అనే యువకుడిపై ఏకంగా అతని మిత్రులే పెట్రోల్ పోసి సజీవ దహనం చేయబోయారు.

    హైదరాబాద్ (Hyderabad) ఎస్ఆర్ నగర్‌లో యువకులు (Youngsters) భీభత్సం సృష్టించారు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి (Erragadda Mental Hosital) గ్రౌండ్‌లో ఆదిల్ అనే యువకుడిపై ఏకంగా అతని మిత్రులే పెట్రోల్ పోసి సజీవ దహనం (Burn Alive) చేయబోయారు. 90 శాతం కాలిన గాయాలతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స (Treatment) పొందుతున్నాడు. అయితే, ఈ హత్యాయత్నానికి (Murder attempt)పాల్పడిన వారు ఇద్దరు పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు. పాత కక్షలను మనసులో పెట్టుకున్న అజర్, అలీ అనే ఇద్దరు యువకులు, ఆదిల్‌కు మిత్రులే (Friends) అని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) కేసు నమోదు చేసుకున్నారు. హత్యాయత్నం చేసిన ఇద్దరికీ నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. గతంలో పలు దొంగతనం (Theft) కేసుల్లో జైలు పాలయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసును లోతుగా కేసును విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

    ప్రైవేట్ పాఠశాలలో  సహాచర విద్యార్థిపై దాడి..

    ఇటీవలి కాలంలో స్నేహితులు (Friends) ఏదైనా చిన్న తప్పు చేసినా దాడి చేసే ఘటనలో ఎక్కువయ్యాయి.  ధన్ బాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో కొందరు విద్యార్థులు, సహాచర విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. తరగతిలో సీటు విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వాగ్వాదం జరిగింది. కొందరు విద్యార్థులు క్రూరంగా దాడి చేశారు. ప్రస్తుతం ఈ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల ప్రకారం.. ధన్ బాద్ జిల్లాలో బింద్రీలో ఒక ప్రైవేటు పాఠశాల ఉంది. కొన్ని రోజులుగా 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మధ్య చిన్న పాటి గొడవలు జరిగాయి. ఒక విద్యార్థిడిని మిగతా వారు టార్గెట్ చేశారు. అతడిని ఎలాగైన చంపాలని కుట్రలు చేశారు.  పిల్లవాడిపై మూకుమ్మడిగా దాడిచేశారు. బాలుడిని విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో దెబ్బలకు తాళలేక అతను.. ఇంటికి చేరుకున్నాడు. అతడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు.

    ఈ క్రమంలో బాలుడి తల్లిదండ్రులు.. తరగతిలోని తోటి విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా అతని స్నేహితులే.. దాడి (Attack)కి పాల్పడుతున్నారని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వచ్చాయి. స్కూల్ లోని సీసీ ఫుటేజీని పరీశీలించారు. అందులో ముగ్గురు విద్యార్థులు బాలుడిపై దాడిచేయడం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పోలీసులు.. ఘటనపై పాఠశాల ప్రిన్స్ పల్ తో చర్చించారు. ఆ తర్వాత వారిపై కేసులను నమోదు చేశారు. ఇప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు, పాఠశాల భవనం ముందు నిరసన తెలుపుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attempt to murder, Crime news, FIRE, Friendship, Hyderabad, Murder

    తదుపరి వార్తలు