ఓ మొబైల్ ఫోన్ (Mobile Phone) స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆ గొడవ చివరికి ప్రాణం తీసే వరకు (Friend Murder) దారి తీసింది. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరు (Tandur) పట్టణంలో జస్వంత్, ప్రశాంత్, రాజు ముగ్గురు స్నేహితులు. ప్రశాంత్‌ది తాండూరు, రాజుది మల్‌రెడ్డిపల్లి, జస్వంత్ అంతారం గ్రామానికి చెందిన వాడు. ఒకరు రోజు ప్రశాంత్ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ (Cellphone) తన ఇద్దరు మిత్రులకు ఇచ్చి డబ్బులు (Money) అవసరం ఉందని దాన్ని అమ్మేసి ఇవ్వాలని చెప్పాడు. మిత్రుడికి అవసరం ఉందని వెంటనే ఆ సెల్ ఫోన్ (Cellphone) పట్టుకొని షాప్ వద్దకు వెళ్లారు రాజు, జస్వంత్. దాన్ని ఎంతకు అమ్మొచ్చో చెప్పాలన్నారు. దాన్ని పరిశీలించిన షాపు (Mobile shop) యజమాని వాళ్లపై కోపడ్డాడు. దొంగిలించిన ఫోన్ (Theft phone) తీసుకొచ్చి అంటగట్టాలని చూస్తారా అంటు మండిపడ్డాడు.
ప్రశాంత్‌ను చంపేయడానికి ప్లాన్..
దొంగతనం (Theft) చేసిన సెల్‌ఫోన్‌ను తమకు అంటగట్టి అవమానించాడని రాజు, జస్వంత్లు ప్రశాంత్‌లు పగ పెంచుకున్నారు. ఎలాగైనా మిత్రుడు ప్రశాంత్‌కు బుద్ది చెప్పాలని భావించారు. ఇద్దరు ప్లాన్ వేసుకొని ఎలా బుద్ది చెప్పాలో అర్థం కాక చంపేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రశాంత్‌ను చంపేయడానికి (Friend Murder) ప్లాన్ చేసిన మిత్రులు రాజు, జస్వంత్ మాట్లాడదామని ఊరి శివారుకు పిలిచారు. అలా అతన్ని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశం చూసుకొని అటాక్ చేశారు. అతని తీవ్రంగా కొట్టి పక్కనే ఉన్న బండరాయి తలపై మోది హత్య (Friend Murder) చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయి..
దొంగిలించిన సెల్‌ఫోన్ తమకు అంటగట్టి పరువు తీయడమే కాకుండా తమను కూడా దొంగలుగా చిత్రీకరించాడన్న కసితో స్నేహితుడ్ని చంపేశారు (Friend Murder) జస్వంత్ (jaswanth), రాజు (Raju). కిరాతకంగా ప్రశాంత్‌ను హత్య చేసిన మిత్రులు నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన జస్వంత్, రాజు.. తాము ఓ హత్య (Friend Murder) చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రశాంత్ అనే తమ స్నేహితుడి ఊపిరి తీశామని అంగీకరించారు.
ఎందుకు చంపారో వివరించిన స్నేహితులు..
ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరించి జస్వంత్, రాజు చెప్పారు. లొంగిపోయిన ఇద్దరు నిందితులను పోలీసులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ మిత్రుల మధ్య చిచ్చు పెట్టడమే కాదు.. హత్య (Friend Murder)కు కూడా దారి తీయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంచలనగా మారింది. క్షణికావేశంలో చేసే పనులు కుటుంబాలకు (Families) శోకాన్ని మిగులుస్తాయని పలువురు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Friendship, Murder, Vikarabad