మద్యానికి డబ్బులు ఇవ్వలేదని...పక్కింటి వ్యక్తిని హత్య చేసి పరారు...

నిందితులు గిరిరాజ్, పవన్ లు మద్యానికి బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డారు. దీంతో తమ పక్కింట్లో ఉంటున్న చందర్ ఖాన్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. అయితే వారి బెదిరింపులకు చందర్ ఖాన్ తిరగబడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితులు పదునైన కత్తితో చందర్ ను హతమార్చి డబ్బులతో పరారయ్యారు.

news18-telugu
Updated: August 1, 2019, 3:08 PM IST
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని...పక్కింటి వ్యక్తిని హత్య చేసి పరారు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని పక్కింటి వ్యక్తిని హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని షకుర్ పూర్ ప్రాంతంలో నిందితులు గిరిరాజ్, పవన్ లు మద్యానికి బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డారు. దీంతో తమ పక్కింట్లో ఉంటున్న చందర్ ఖాన్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. అయితే వారి బెదిరింపులకు చందర్ ఖాన్ తిరగబడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితులు పదునైన కత్తితో చందర్ ను హతమార్చి డబ్బులతో పరారయ్యారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని అదే ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలోని పొదల్లో పారేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి శవంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా, అది చందర్ ఖాన్ శవంగా గుర్తించారు.

అనంతరం పోలీసులు నేరపరిశోధనలో హంతకులను గుర్తించారు. పక్కింట్లో ఉండే గిరిరాజ్, పవన్ లే హంతకులుగా గుర్తించారు. వారి నుంచి రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.
Published by: Krishna Adithya
First published: August 1, 2019, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading