అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఏ అండ్ ఏం యూనివర్శిటీలో దుండుగులు కాల్పులకు దిగాడు. విచక్షణారహితంగా అతడు జరిపిన కాల్పులకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయాల పాలయ్యారు. అయితే ఇక్కడ జరిగిన ఈ కాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు కూడా మహిళలే. మరో రెండేండ్ల బాలిక గాయపడింది. కాల్పుల్లో గాయపడ్డ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రైడ్ రాక్ రెసిడెన్స్ హాల్లోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడున్న మహిళలపై కాల్పులు జరిపి పరారీ అయ్యాడు. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మహిళలు.. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తే కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్ఎం కామర్స్ వర్సిటీలో సుమారు 1600 మంది భారతీయ విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో క్యాంపస్‌కు సెలవు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.