రోడ్డుపై మూత్రం పోశారని ఇద్దరు పిల్లలను కొట్టి చంపారు..

తీవ్ర గాయాల పాలైన బాలురను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే వారు చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు.

news18-telugu
Updated: September 25, 2019, 3:54 PM IST
రోడ్డుపై మూత్రం పోశారని ఇద్దరు పిల్లలను కొట్టి చంపారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బహిరంగ మలమూత్ర విసర్జన, మల విసర్జన చేయడం తప్పు. అలా చేస్తే ఎక్కడైనా జరిమానా విధించి మందలించి వదిలేస్తారు. కానీ అక్కడ మాత్రం ఏకంగా కొట్టి చంపారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. రోషాని (12), అవినాష్(10) అనే ఇద్దరు దళిత బాలురు బావ్‌ఖేడీ గ్రామ పంచాయతీ ముందు రోడ్డుపై బహిరంగ మూత్రవిసర్జన చేశారు. ఈ విషయంలో గ్రామస్తులకు తెలిసింది. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా చితకబాదారు. ముఖం, పొట్టభాగంతో పాటు ఇతర శరీర భాగాలపై పిడిగుద్దులు కురిపించారు.

తీవ్ర గాయాల పాలైన బాలురను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే వారు చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు. ఈ విషయం తెలిసి నిందితులు ఇద్దరు గ్రామం నుంచి పారిపోయారు. వారిని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆటవిక చర్యను దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాగా, రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లోనూ మూకదాడి జరిగింది. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>