• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO CRIMINALS SHOT DEAD IN AN ENCOUNTER WITH UP STF IN PRAYAGRAJ SK

Encounter: జైలర్‌ను చంపిన రౌడీల ఎన్‌కౌంటర్.. బైక్‌పై పారిపోతుండగా వేటాడిన పోలీసులు

Encounter: జైలర్‌ను చంపిన రౌడీల ఎన్‌కౌంటర్.. బైక్‌పై పారిపోతుండగా వేటాడిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇద్దరికీ తీవ్రమైన బుల్లెట్ గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటి వారిద్దరు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.

  • Share this:
    యూపీలో ఎన్‌కౌంటర్ జరిగింది. రౌడీలు, పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు క్రిమినల్స్ హతమయ్యారు. ప్రయాగ్ రాజ్ జిల్లా అరైల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను సుపారీ కిల్లర్స్ వకీల్ పాండే, అంజద్‌గా గుర్తించారు. ఓ రాజకీయ నాయకుడి హత్యకు కుట్ర జరిగిందన్న సమాచారంతో అరైల్‌లోని నైని సోమేశ్వరనాథ్ ఆలయం సమీపంలో యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇద్దరికీ తీవ్రమైన బుల్లెట్ గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటి వారిద్దరు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.


    ఘటనా స్థలం నుంచి నుంచి 30 లైవ్ క్యాట్రిట్జ్, 9ఎంఎం పిస్టల్స్‌తో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. మృతుల తలలపై రూ.50 వేల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మొదట వారెవరో తమకు తెలియదని.. తనిఖీలు చేస్తున్న పోలీసులపై కాల్పులు జరపడంతో, ఎదురు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. మృతదేహాలను చూసిన తర్వాత వారు షార్ప్ షూటర్స్ అన్న విషయం తెలిసిందని తెలిపారు. కాగా, మృతులు వకీల్ పాండే, అంజద్ గతంలో పలు హత్య కేసుల్లో దోషులుగా ఉన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారు. 2013లో డిప్యూటీ జైలర్ అనిల్ కుమార్ త్యాగిని పట్టపగలే హత్య చేశారు. గ్యాంగ్‌స్టర్స్ మున్నా భజ్‌రంగీ, ముఖ్తార్ అన్సారీ ఆదేశాలతో జైలర్‌ను చంపేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: