• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO COUPLES DIE IN ROAD ACCIDENTS IN VIKARABAD DISTRICT BN

విషాదం.. నిశ్చితార్థానికి వెళుతూ.. కానరాని లోకాలకు.. చిదిమేసిన కారు..

విషాదం.. నిశ్చితార్థానికి వెళుతూ.. కానరాని లోకాలకు.. చిదిమేసిన కారు..

ఖమ్మం జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది.

మార్గమధ్యలో ఉదయం 7 గంటలకు సోమన్‌గుర్తి గేటు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ గాలిలోకి ఎగిరిపడ్డారు.

  • Share this:
    శుభకార్యానికి వెళుతూ ఇద్దరు దంపతులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటకు చెందిన యు.ఆనంద్(35), ఉషమ్మ(30) దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు. హైదరాబాద్ శివారు గండిమైసమ్మలో నివాసం ఉంటున్నారు. బుధవారం పూడూరు మండలం సోమన్‌గుర్తిలో ఆనంద్ సోదరి కూతురు నిశ్చితార్థానికి దంపతులిద్దరూ బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో ఉదయం 7 గంటలకు సోమన్‌గుర్తి గేటు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ గాలిలోకి ఎగిరిపడ్డారు. అంతలోనే ఎదురుగా మరో పరిగి వైపు నుంచి దూసుకొచ్చిన కారు వీరీపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే చనిపోయారు.
    Published by:Narsimha Badhini
    First published: