జెండా స్తంభానికి విద్యుత్ షాక్...ఇద్దరు టెన్త్ విద్యార్థులు మృతి

అది లోహపు స్తంభవం కావడంతో ఇద్దరు విద్యార్థులకు షాక్ తగిలింది. స్కూల్ సిబ్బంది, తోటి విద్యార్థులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐతే అప్పటికే వారిద్దరు చనిపోయారని వైద్యులు ధృవీకరించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

news18-telugu
Updated: August 15, 2019, 5:46 PM IST
జెండా స్తంభానికి విద్యుత్ షాక్...ఇద్దరు టెన్త్ విద్యార్థులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం నెలకొంది. జాతీయ జెండా స్తంభానికి కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు చనిపోయారు. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా కెన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం లోహపు జెండా స్తంభాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు అది విద్యుత్ తీగలకు తగలింది. దాంతో జెండా స్తంభాన్ని పట్టుకున్న విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పదోతరగతి విద్యార్థులు దిలీప్ రాణా(15), గణపత్ వాల్వాయ్ (15) చనిపోయారు.

పంద్రాగస్టు నేపథ్యంలో స్కూల్ విద్యార్థులు నిన్న సాయంత్రమే జెండా స్తంభాన్ని అలంకరించి స్కూల్‌ మిద్దెపై పెట్టారు. ఇవాళ ఉదయం ఆ జెండా స్తంభాన్ని కిందుకు తీసుకొచ్చేందుకు మిద్దెపైకి ఇద్దరు విద్యార్థుల వెళ్లారు. పోల్‌ని కాస్త పైకిఎత్తి కిందకు తీసుకొచ్చే క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. అది లోహపు స్తంభవం కావడంతో ఇద్దరు విద్యార్థులకు షాక్ తగిలింది. స్కూల్ సిబ్బంది, తోటి విద్యార్థులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐతే అప్పటికే వారిద్దరు చనిపోయారని వైద్యులు ధృవీకరించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వారు చనిపోయారంటూ రోదిస్తున్నారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అన్న కోణంలో పాఠశాల సిబ్బందిని విచారిస్తున్నారు పోలీసులు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...