విమానం ఎత్తుకెళ్లిన పిల్లలు.. ఎక్కడో తెలుసా ?

14, 15 ఏళ్ల వయస్సున బాలలు.. వారం కిందట వసాచ్‌ ఫ్రంట్‌ ప్రాంతం నుంచి పారిపోయారు జెన్సెన్‌లోని వారి స్నేహితుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఓట్రాక్టర్ సంపాదించి ట్రాక్టర్ నడుపుతూ ఓ ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్‌కు చేరుకున్నారు.

news18-telugu
Updated: November 24, 2018, 1:36 PM IST
విమానం ఎత్తుకెళ్లిన పిల్లలు.. ఎక్కడో తెలుసా ?
అమెరికాలో బుల్లి విమానం చోరీ
  • Share this:
అమెరికాలో విమానం దొంగతనం జరిగింది. విమానం ఏంటి ? దొంగతనం ఏంటి? అనుకుంటున్నారా? అవునండి నిజం. అమెరికాలో ఓ బుల్లి విమానాన్ని చోరీ చేశారు. అయితే ఈ పని చేసింది ఎవరో తెలుసా? ఇద్దరు పిల్లలు. దీంతో అవాక్కైన పోలీసులు ఉటాహ్ ప్రాంతంలో ఈ ఇద్దర్ని అరెస్ట్ చేశారు.

సినిమాల్లో మాత్రం కనిపించే ఇలాంటి సంఘటన అమెరికాలోని యూటాలో జరిగింది. సుమారు 14, 15 ఏళ్ల వయస్సున బాలలు.. వారం కిందట వసాచ్‌ ఫ్రంట్‌ ప్రాంతం నుంచి పారిపోయారు జెన్సెన్‌లోని వారి స్నేహితుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఓట్రాక్టర్ సంపాదించి ట్రాక్టర్ నడుపుతూ ఓ ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్‌కు చేరుకున్నారు. అక్కడ ఆగిఉన్న ఓ తేలికపాటి చిన్న విమానాన్ని దొంగలించారు. అంతేకాదు విమానం నడుపుకూంటూ వెర్నల్ ప్రాంతానికి వెళ్లిపోయారు.

అయితే అతి తక్కువ విమానంలో ఎగురుతుండటం చూసి ఆందోళనకు గురయ్యారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విమానం వద్దకు చేరుకున్న పోలీసులు అందులో పిల్లల్ని చూసి షాక్ అయ్యారు. ఇంత చిన్నోళ్లు ఫ్లేట్ ఎలా నడిపారంటూ ఆశ్చర్యపోయారు. దీంతో వీరిద్దర్నీ అరెస్ట్ చేసినట్లు ఫేస్ ‌బుక్‌లో ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు పిల్లల్ని స్ప్లిట్ మౌంటెయిన్ బాలల నిర్బంధ సదనానికి తరలించారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 24, 2018, 1:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading