Food poison : అమ్మ...పెట్టిన చికెన్‌తో కటుంబంలో విషాదం.. ఇద్దరు పిల్లలతో పాటు తల్లీ కూడా...!

ప్రతీకాత్మక చిత్రం

Food poison : అమ్మ పెట్టిన చికెన్ ఇష్టంగా తిన్న ఇద్దరు చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోయారు..మరో వైపు అదే చికెన్ తిన్న తల్లి కూడా ప్రాణాలతో కొట్టుమిట్టడుతోంది.

  • Share this:
    మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.తూఫ్రాన్ మండలం వెంకటాయపల్లెకు చెందిన బుల్లె మల్లెశ్ దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి మనోహారబాద్‌లోని ఓ కోళ్ల ఫాంలో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కోళ్ల ఫాంలో ఉన్న కోళ్లను యజమాని అమ్మకానికి తీసుకెళ్లాడు. అయితే వాటిలో కొన్ని అనారోగ్యంతో ఉండడంతో వాటిని అక్కడే వదిలేశాడు.

    ఈ క్రమంలోనే మల్లెశ్ భార్య బాలామణి సోమవారం రాత్రి అనారోగ్యంతో ఉన్న కోళ్లను కోసి కర్రీ చేసింది.అనంతరం మల్లెశ్ మినహా 13 సంవత్సరాల వయస్సున్న కుమార్తే మనిషా, కుమారుడితో కలిసి చికెన్‌తో భోజనం చేశారు.అయితే ఫాయిజన్‌గా మారి తెల్లవారు జామున ఇద్దరు పిల్లలు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో బాలమణి తన తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వెంటనే వారిని స్థానిక తూఫ్రాన్ ఆసుపత్రికి తరలించారు.

    అయితే చికిత్స పొందుతున్న ఇద్దరు పిల్లల పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు..అయితే కండిషన్ సీరియస్‌గా ఉండడంతో తిరిగి తూఫ్రాన్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే ఇద్దరు పిల్లలు తనువు చాలించారు. ఇలాంటీ పరిస్థితుల్లో మరో విషాదం కూడా చోటు చేసుకుంది..అప్పటి వరకు బాగానే బాలామణి కూడా అనారోగ్యానికి గురైంది..కడుపునొప్పితో వాంతులు చేసుకోవడంతో ఆమెను కూడా తుఫ్రాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    కాగా విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే భర్త మల్లెశ్ మాత్రం ఆ రోజు తన యజమానులు వండుకున్న చికెన్ తిన్నట్టు తెలుస్తోంది. మరి భార్యతో పాటు పిల్లలు తిన్న చికెన్ ఎందుకు తినలేదనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనారోగ్యం పాలైన కోళ్లను పాతిపెట్టకుండా యాజమాని చేసిన నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. దీంతో మల్లెశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
    Published by:yveerash yveerash
    First published: