Children get locked in car died : ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్కార్పియో కారులో ఇరుక్కపోయారు. కారు డోర్ లాక్(Car Door Lock) అవడంతో ఊపిరాడక(Suffocation) ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని బదౌన్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్(Badaun) జిల్లాలో సహస్వాన్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీపూర్ ఖేరు గ్రామంలో సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులు సలీం (5), అయాన్ (5) కనిపించకుండా పోయారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. పొరుగింటివారిని మరియు సమీపంలోని ప్రజలను కూడా అడిగారు. ఎంత వెతికినా పిల్లలు కనబడకపోవడంతో లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేయమని మసీదును కోరారు. మసీదులో ప్రకటన చేసినా ఫలితం లేదు. తప్పిపోయిన పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. సహస్వాన్ పోలీసు ఇన్స్పెక్టర్ సంజీవ్ శుక్లా మరియు ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి కోసం వెతకడం ప్రారంభించారు.
Honour Killing : పెళ్లైన ఐదు రోజులకు దంపతులను దారుణంగా నరికి చంపేశారు
పోలీసు అధికారి సంజీవ్ శుక్లా మాట్లాడుతూ.."మేము తప్పిపోయిన మైనర్ పిల్లల కోసం వెతుకుతున్నప్పుడు, ఇంటి వెలుపల స్కార్పియో ఆపివేయబడిందని మరియు వాహనం కిటికీలకు కర్టెన్లు ఉన్నాయని మేము గమనించాము. కుటుంబ సభ్యులలో ఒకరు అప్పుడు కిటికీపై పిల్లల చేయి గమనించారు. దీంతో చిన్నారుల కుటంబసభ్యుల సమక్షంలో కారు డోర్లు ఓపెన్ చేసి చూడగా..ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లగా..అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు డిక్లేర్ చేశారని తెలిపారు.
మరోవైపు, అత్తమామల ఇంట్లో ఉంటున్న భార్యను కలవాలని తహతహలాడిన ఓ యువకుడు పోలీస్ జీపు(Police Jeep)ని దొంగలించి ఎత్తుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్(UttarPradesh) లోని బస్తీ జిల్లాలోని సోనాపూర్ లో ఆదివారం గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ నిర్వహించబడింది, దీనికి మహిళా సంక్షేమ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబీ రాణి మౌర్య మరియు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విజయ్ లక్ష్మీ గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో అక్కడ విధులు నిర్వర్తించేందుకు కొత్వాల్ నగర పోలీసు అధికారి సంజయ్ కుమార్ వెళ్లారు. అయితే జనం భారీగా రావడంతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. జీపు పార్కింగ్ చేసే ఖాళీ కూడా లేకుండా పోయింది. దీంతో అక్కడకు కొంత దూరంలో రోడ్డు పక్కన జీపుని పార్క్ చేసి ఆ దగ్గర్లోనే సేదతీరాడు డ్రైవర్ దీపేంద్ర. అయితే మంత్రుల పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని చాలా టాక్సీలు ప్రోగ్రామ్ కోసం బుక్ చేయబడ్డాయి. ట్యాక్సీల బుకింగ్ కారణంగా సామాన్యులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
ఇదే సమయంలో పుట్టింట్లో ఉన్న తన భార్యను కలవడానికి వెళదామనుకున్న ముండెర్వా పోలీస్ స్టేషన్ పరిధి ఛపియా లుతావాన్ గ్రామానికి చెందిన హరేంద్ర(Harendra)అనే 30 ఏళ్ల యువకుడు కూడా సోనాపూర్ లో ట్యాక్సీ దొరక్క ఇబ్బంది పడ్డాడు. అయితే ఎలాగైనా సరే ఈరోజు వెళ్లి భార్యను కలవాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో పోలీసు జీపు రోడ్డు పక్కన ఖాళీగా ఉండటం, దానికే తాళం ఉండటాన్ని గమనించాడు. పోలీసులు, జనం కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన హరేంద్ర పోలీస్ జీపును తీసుకుని పరారయ్యాడు. అయితే కొద్దిసేపటి తర్వాత జీవును ఎవరో తీసుకెళ్తున్నారని గమనించిన డ్రైవర్ దీపేంద్ర అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే మరో వాహనంలో వెంబడించారు. పోలీసులు వెంట పడుతున్నారనే భయంతో జీపుని వేగంగా పోనిచ్చాడు హరేంద్ర. దీంతో కొంతదూరం వెళ్లేసరికి జీపు అదుపుతప్పి పర్సా క్రాస్‌రోడ్డు ప్రాంతంలో రహదారి పక్కన ఉన్న చెక్కల కుప్పని ఢీకొట్టి జీపు డ్యామేజీ అయింది. అయితే అక్కడి నుంచి పారిపోయేందుకు హరేంద్ర ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Two childrens, Uttar pradesh