• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO CHILDREN DIED AFTER ACCIDENTALLY FALL IN CANAL IN MANCHERIAL SU ADB

Telangana: ఆ కుటుంబంపై విధి చిన్నచూపు.. వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Telangana: ఆ కుటుంబంపై విధి చిన్నచూపు.. వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

వాగులో పడి మృతిచెందిన చిన్నారులు

బతుకు దెవురు కోసం పొట్టచేతపట్టుకొని సంచార జీవనం సాగిస్తున్న ఓ కుటుంబాన్ని విధి కాటేసింది.

  • Share this:
    బతుకు దెవురు కోసం పొట్టచేతపట్టుకొని సంచార జీవనం సాగిస్తున్న ఓ కుటుంబాన్ని విధి కాటేసింది. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు స్నానానికని వాగుకు వెళితే, ప్రమాదవశాత్తు అందులోనే పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన యాదయ్య, అలివేణి దంపతులు వలస కూలీలు కావడంతో నిన్న మంచిర్యాల జిల్లాకు చేరుకొని కుర్మపల్లి గ్రామ సమీపంలో చిన్న డేరాలు వేసుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం యాదయ్య, అలివేణి దంపతులు కూలి పని కోసం వేరే ప్రాంతానికి వెళ్ళారు. తల్లిదండ్రులు పనికి వెళ్ళడంతో ఇంటి వద్దే ఉన్న వారి ఇద్దరు కూతుళ్లు స్వాతి (9,) ప్రతిష్ట (5) గ్రామ సమీపం లోని రాళ్ళ వాగులో స్నానం కోసం వెళ్ళారు.

    స్నానానికి వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకు పోయారు. స్థానికులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వాగులో వెతకగా అప్పటికే ఆ ఇద్దరు మృతి చెందారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మృత దేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లల మృత దేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ దృశ్యాలు స్థానికులను కలచివేశాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు