మేకలను అమ్మిన డబ్బులతో సినిమా.. కానీ అరెస్టు..! ఎందుకు..?

ఇద్దరు సోదరులు కలిసి తమ తండ్రిని గెలిపించాలనుకున్నారు. తండ్రిని ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు. ఆయన చేస్తున్న పనికి ఉడతా భక్తిగా సాయం కూడా చేశారు. కానీ అరెస్టయ్యారు.

news18
Updated: November 14, 2020, 6:15 AM IST
మేకలను అమ్మిన డబ్బులతో సినిమా.. కానీ అరెస్టు..! ఎందుకు..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 14, 2020, 6:15 AM IST
  • Share this:
బావ కళ్లల్లో సంతోషం చూడటానికో.. అక్కను ఆనందంగా ఉంచడానికో ఏ పనికైనా సిద్దంగా ఉండే బ్యాచ్ ను చూసుంటారు. కూతురు, కొడుకు గెలుపులోనే తమ గెలుపును చూసుకునే తల్లిదండ్రులు చాలా మందే ఉంటారు. కన్నవారిని గెలిపించాలనుకునేవాళ్లే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు అన్నాతమ్ములు... తమ తండ్రిని గెలిపించాలనుకున్నారు. తండ్రి సినిమా తీస్తుంటే.. ఆయన లక్ష్యం నెరవేర్చడం కోసం వాళ్లు రేయింబవళ్లు కష్టపడ్డారు. ఆ తండ్రి లక్ష్య సాధనలో వెనకడుగు వేయకుండా.. డబ్బులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి పొద్దనక, మాపనక ఊర్ల వెంట తిరిగారు. డబ్బులైతే సంపాదించారు. కానీ చివరికి అరెస్టయ్యారు. అదేంటి..? ఇంత కష్టపడ్డా అరెస్ట్ ఎందుకయ్యారనుకుంటున్నారా...? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.

వివరాల్లోకెళ్తే.. తమిళనాడు రాజధాని చెన్నై లోని న్యూవాషర్మెన్ పేట్ కు చెందిన విజయ్ శంకర్ కు సినిమాలంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోకి వెళ్లాలని కోరిక ఉండేది. కానీ ఎందుకో అది వీలుకాలేదు. కానీ తాను ఎలాగైనా సినిమా తీయాలని అనుకున్నాడు. కథ సిద్దం చేసుకున్నాడు. పలువురు హీరోలను సంప్రదిస్తే.. వాళ్లు కష్టమన్నారు. ఇక ఎవరెవర్నో బతిమిలాడటం దేనికి..? తన పుత్ర రత్నాలున్నారుగా.. వారినే పెట్టి సినిమా తీద్దామనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వారిని అందుకోసం సిద్ధం చేశాడు. నటనలో ఓనమాలే కాదు.. పీహెచ్డీలే చేయించాడు. వారి పేర్లు నిరంజన్ కుమార్, లెనిన్ కుమార్.

నిరంజన్, లెనిన్ ఇద్దరూ కలిసి నటనపై ఆసక్తితో నటన నేర్చుకున్నా.. సినిమాకు డబ్బులెలా..? ఆ తండ్రి ఉత్సాహం అంతలోనే ఆవిరైపోయింది. ఇది చూసిన ఆ కొడుకులు కుమిలిపోయారు. తమ తండ్రిని ఎలాగైనా గెలిపించాలనుకున్నారు. తండ్రిని నిరాశ చెందొద్దని.. ఏదైనా కష్టం చేసి తాము సినిమాకు డబ్బులు తీసుకొస్తామని చెప్పారు. తండ్రి ఆశయం ఆగిపోకూడదని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడువుగా.. వారానికి కొంత డబ్బును తీసుకొచ్చి తండ్రికి ఇవ్వడం మొదలెట్టారు.

ఇంతకీ వాళ్లు ఏం పనిచేశారనుకుంటున్నారు..? అక్కడికే వస్తున్నాం. నిరంజన్, లెనిన్ ఇద్దరూ.. చుట్టుపక్కల ఉండే గ్రామాల వైపుగా వెళ్తారు. అక్కడ రోడ్డు పక్కన యజమాని లేకుండా మేత మేస్తున్న మేకలు, గొర్రెలను చూస్తారు. ఎవరూ లేని సమయం చూసి వాటిని కార్లోకి ఎక్కిస్తారు. వాటిని తీసుకొచ్చి వేరే ఊర్లలో అమ్మేస్తుంటారు. అలా వారానికి ఖర్చులన్నీ పోనూ రూ. 20 వేల నుంచి రూ. 50 వేల దాకా సంపాదించారు. ఈ వ్యవహారం మూడేళ్లుగా సాగుతుంది. అయితే ఇన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా ఎవరికీ అనుమానం రాలేదా..? అక్కడే మోసగాళ్లు జాగ్రత్తపడ్డారు. ఒక మేకల మంద నుంచి పది, పదిహేను పోతే ఎవరైనా ఆందోళన చెంది కంప్లయింట్ ఇస్తారు.. కానీ ఒక్కటో, రెండో కనిపించకుంటే పెద్దగా పట్టించుకోరు. ఆ సోదరులిద్దరూ అదే పని చేసేవారు.

ఈ వ్యవహారం కొనసాగుతుండగా.. ఈ నెల 9న ఒక ప్రాంతం నుంచి అర డజను మేకలను తీసుకొచ్చారీ సోదరులు. అయితే సదరు యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు వాళ్లు సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయగా.. దొంగలు దొరికారు. వారి మీద ఓ కన్నేసి ఉంచిన పోలీసులు.. తర్వాతి ఆపరేషన్ చేస్తున్న ప్రదేశంలోనే సివిల్ డ్రెస్ లో మఫ్తీ పోలీసులను ఉంచి వారి ఆటకట్టించారు. నిరంజన్, లెనిన్ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. వాళ్లు అసలు నిజాన్ని ఒప్పుకుని కటకటాల వెనక్కి వెళ్లారు. అదీ అసలు కథ. ఇంతకీ విజయ్ శంకర్ తీస్తున్న సినిమా పేరేంటో తెలుసా..? ‘నీ ధాన్ రాజా...’ తెలుగులో అనువదిస్తే.. ‘నూవే రాజువి..’...
Published by: Srinivas Munigala
First published: November 14, 2020, 6:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading