కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మేకలను కడిగేందుకు చెరువులోకి వెళ్లిన ఇద్దరు బాలురు నీటిలో ముగిని చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామాంలోని రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన ఓదెలు(16), అనిల్(15) ఇద్దరు బాలురు మేకలను మేపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామంలోని చెరువులో మేకలను కడిగేందుకు దిగారు. మేకలను కడిగే క్రమంలో ప్రమాదశాత్తు చెరువులో పడి నీటమునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన బాలురు చెరువులో పడి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Police, Telangana