HOME »NEWS »CRIME »two bhopal railway officers gangrape up woman on station premises su

ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి.. స్టేషన్‌ పరిసరాల్లో యువతిని రేప్ చేసిన రైల్వే అధికారులు..

ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి.. స్టేషన్‌ పరిసరాల్లో యువతిని రేప్ చేసిన రైల్వే అధికారులు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణికులకు సాయం అందించాల్సిన ఇద్దరు రైల్వే అధికారులు ఓ యువతిని రేప్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిపై దారుణానికి ఒడిగట్టారు.

  • Share this:
    భోపాల్ ప్రధాన రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రయాణికులకు సాయం అందించాల్సిన ఇద్దరు రైల్వే అధికారులు ఓ యువతిని రేప్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిపై దారుణానికి ఒడిగట్టారు. అది కూడా స్టేషన్ పరిసరాల్లోనే కావడం సంచలనంగా మారింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు.. ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరైన భోపాల్ రైల్వే డివిజన్ సెక్యూరిటీ కౌన్సిలర్, విపత్తు నిర్వాహణ ఇంచార్జ్ రాజేష్ తివారిని అరెస్ట్ చేశామని రైల్వే పోలీసులు తెలిపారు. మరో రైల్వే అధికారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

    వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతికి రాజేష్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు జాబ్ ఇప్పిస్తానని చెప్పిన రాజేష్.. భోపాల్‌కు రమ్మన్నాడు. అయితే జాబ్‌పై ఆశతో భోపాల్ చేరకున్న ఆమెను.. భోపాల్ ప్రధాన స్టేషన్‌లోని ఫ్టస్ ప్లోర్‌లో గల వెస్ట్ సెంట్రల్ రైల్వే కార్యాలయంలోని గదికి తీసుకెళ్లాడు. అక్కడ రాజేష్ మరో రైల్వే అధికారితో కలిసి ఆమెకు డ్రగ్స్ కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అనంతరం వారిద్దరు యువతిని రేప్ చేశాడు. స్పృహాలోకి రాగానే జరిగిన విషయం అర్థమైన యువతి.. వెంటనే రైల్వే పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.



    ఈ ఘటనకు సంబంధించి భోపాల్ సూపరిండెంట్ ఆఫ్ రైల్వే పోలీసు హితేశ్ చౌదరి మాట్లాడుతూ.. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశామని, మరో రైల్వే అధికారిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తి‌ని బాధిత యువతి గుర్తించాల్సి ఉందని.. ఆమె గుర్తపట్టిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:September 27, 2020, 09:43 IST