పెరిగిన ధరలు.. 550 కిలోల ఉల్లిని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు

దేశంలో ఒక్కసారిగా ఉల్లిధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల కిందట చౌకగా లభించిన ఉల్లి.. ఇప్పుడు ప్రియంగా మారింది.

news18-telugu
Updated: October 23, 2020, 3:27 PM IST
పెరిగిన ధరలు.. 550 కిలోల ఉల్లిని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఒక్కసారిగా ఉల్లిధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల కిందట చౌకగా లభించిన ఉల్లి.. ఇప్పుడు ప్రియంగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు 550 కిలోల ఉల్లిని దొంగతనం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. నిందితులను సంజయ్ పరాది, పొపట్ కాలేలుగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన నారాయణ్ గావ్ పోలీసులు.. వారిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇక, వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటుగా.. సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది. ఇది కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా ఉంది. ఇక, ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.

మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇప్పటికే కిల్లో ఉల్లి ధర 100 రూపాయలు దాటింది. వెజిటేబుల్స్‌లో ఇప్పుడు ఉల్లి ఖరీదైనదిగా నిలిచింది. రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర.. ముంబైలో 80 నుంచి 100 రూపాయలు, పుణేలో 100 నుంచి 120 రూపాయలుగా ఉంది. ఉల్లి ధరలు పెరగడంపై పుణే మార్కెట్ యార్డ్‌కు చెందిన కమిషన్ ఏజెంట్ విలాస్ భుజ్‌బాల్ మట్లాడుతూ.. సాధారణంగా వచ్చే స్టాక్‌తో పోలిస్తే అక్టోబర్ 21న సగం స్టాక్ మాత్రమే వచ్చిందని తెలిపాడు. కొత్త పంట వచ్చే వరకు రేట్లు పెరుగుతూనే ఉండే అవకాశం ఉందని చెప్పాడు.ఇక, ఖరీఫ్‌లో వేసిన 50 శాతం ఉల్లి పంటలు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని మహారాష్ట్ర ఉల్లి పెంపకపుదారుల అసోసియేషన్ తెలిపింది.

గతంలో కూడా ధరలు పెరిగిన సందర్భాల్లో పలుచోట్ల ఉల్లి దొంగతనాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉల్లి కోసం గొడవలు కూడా జరిగాయి. ధరల విషయంలో వినియోగదారులు, అమ్మకపుదారులు ఘర్షణకు దిగారు.
Published by: Sumanth Kanukula
First published: October 23, 2020, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading