Home /News /crime /

TWO ARRESTED FOR RAPING AND MURDERING INSANE WOMAN IN MEDAK DISTRICT SNR MDK

Crime news : మతిస్థిమితం లేని మహిళపై మృగాళ్ల వేట .. అత్యాచారం, హత్య తర్వాత ఏం చేశారో తెలుసా

(మతిస్థిమితం లేని మహిళపై..)

(మతిస్థిమితం లేని మహిళపై..)

Medak: మెదక్ జిల్లాలో మతిస్తిమితం సరిగా లేని మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు చిక్కారు. వారం రోజుల వ్యవధిలో నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితులు బిహార్‌కి చెందిన వాళ్లుగా తేల్చారు.

ఇంకా చదవండి ...
    (K.Veeranna,News18,Medak)
    మానసిక పరిస్థితి సరిగా లేని ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి అటుపై హత్య చేసిన కేసులో మిస్టరీని చేధించారు మెదక్ జిల్లా పోలీసులు. వారం రోజుల క్రితం మెదక్(Medak)జిల్లా పెద్దశంకరంపేట(Peddashankarampet)మండలంలో జరిగిన మహిళ మర్డర్(Woman Murder)కేసులో నిందితులు ఇద్దరూ బీహార్‌కి చెందిన వాళ్లుగా తేల్చారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

    16న హత్యాచారం, హత్య..
    ఈనెల 21వ తేదిన నాడు శివయ్యపలి గ్రామ సమీపంలోని వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన మహిళ మృతదేహం కుక్కల లక్ష్మీగా తేల్చారు పోలీసులు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలానికి చెందిన మృతురాలికి మానసికపరిస్థితి సరిగా లేకపోవడంతో ఊరిలో అక్కడక్కడ తిరుగుతూ ఎవరన్నా ఏదైనా ఇస్తే తింటూ ఉండేది. మృతురాలికి ఇద్దరు ఆడ సంతానం ఉన్నారు. చెడి ముఖియా, సంజిత్ రిషిదేవ్ అనే ఇద్దరు బీహార్‌కు చెందిన వ్యక్తులు మృతురాలిని ఈనెల 16 వ తేదిన రాత్రి 8గంటల సమయంలో శివయ్యపల్లి గ్రామంలో కల్లు తాగి వస్తుండగా షీక్ ఖాసిం టీ స్టాల్ దగ్గరున్న గుడిసెలో మృతురాలు కూర్చోని ఉండటం చూశారు. ఆమెను అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్న ఇద్దరు నిందితులు.

    21వ తేదిన బయటపడ్డ శవం..
    కల్లు తాగిన తర్వాత షీక్ ఖాసిం టీ స్టాల్‌కు వెళ్లారు. అక్కడే మద్యం తాగారు. అటుపై ఇద్దరు నిందితులు మహిళ కూర్చున్న  గుడిసె దగ్గరకు వెళ్లారు. మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. అక్కడి నుంచి వచ్చి రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా మహిళను ఫాలో అయ్యారు ఇద్దరు నిందితులు. కొంత దూరం పోయిన తర్వాత ఆమెను బలవంతంగా రోడ్డు పక్కనే ఉన్నవ్యవసాయ భూముల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమోననే అనుమానంతో నిందితులిద్దరూ కలిసి ఆమెను హత్య చేసి మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    ఇది చదవండి: వంకాయ కూరలో చికెన్ గ్రేవీ మిక్స్.. అర్ధరాత్రి ఆసుపత్రికి 128 మంది అమ్మాయిలు



    వారం రోజుల్లో నిందితులు అరెస్ట్ ..
    ఈనెల 21వ తేదిన మృతదేహం చేతులు, కాళ్లు బయటకు కనిపించడంతో భూమి యజమాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెదక్ డి.ఎస్.పి ఆద్వర్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహిళ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్లుగా ఎస్పీ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతానికి  చుట్టు పక్కల వ్యక్తులను అక్కడి రైస్ మిల్లులో పని చేసే వారిని విచారించారు. ఇద్దరు వ్యక్తులపై అనుమానం రావడంతో వాళ్లను అదుపులోకి తీసుకొని విచారించగా నిజం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మర్డర్ కేసులో మిస్టరీని చేధించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ క్యాష్ రివార్డ్‌ను అందజేశారు.

    ఇది చదవండి : పేద విద్యర్ధిని తానే స్వయంగా బడికి పంపిన మంత్రి .. మాట నిలబెట్టుకున్నందుకు ప్రశంసల వెల్లువ

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Medak Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు