పూజ పేరు చెప్పి శోభనం.. అలా గడపకపోతే సర్ప దోషం పోదని..

ప్రతీకాత్మక చిత్రం

పూజ అనంతరం మరో ప్రక్రియ ఉందని చెప్పి.. తమతో ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించారు. ఇందుకోసం ఓ హోటల్‌లో గదులు కూడా బుక్ చేశారు.

  • Share this:
    సర్పదోషం పేరుతో మహిళను లైంగికంగా లోబరుచుకోవడానికి యత్నించిన ఇద్దరు స్వాములను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తమతో ఐదుసార్లు తాళి కట్టించుకుని.. ఐదు శోభనాలు జరిపించుకోవాలని వారు మహిళకు సూచించారు. పూజతో పాటు ఇది కూడా చేస్తేనే సర్పదోషం సత్ఫలితాలను ఇస్తుందని నమ్మబలికారు. బాధితురాలి తీరును చూసి ఆశ్చర్యపోయిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

    పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉండే ఓ మహిళ బాణసవాడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గొడవల కారణంగా భర్తతో విడిపోయిన ఆమెకు సర్పదోషం ఉందని ఇటీవల ఎవరో చెప్పారు. దాంతో సర్పదోష నివారణ కోసం పరిచయస్తుడైన జగన్నాథ్‌ను సంప్రదించింది. కామస్వామి గణేష్,మణికంఠ అనే ఇద్దరు స్వాములను జగన్నాథ్ పరిచయం చేశాడు.వీరిద్దరు తండ్రీకొడుకులు సర్ప దోష నివారణకు పూజ చేయాలని చెప్పి రూ.40వేలు వసూలు చేశారు.

    పూజ అనంతరం మరో ప్రక్రియ ఉందని చెప్పి.. తమతో ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించారు. ఇందుకోసం ఓ హోటల్‌లో గదులు కూడా బుక్ చేశారు. ఇంతలోనే విషయం బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలిసింది.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం వీరిద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
    First published: