హోమ్ /వార్తలు /క్రైమ్ /

Couple : ఎంత ఉన్నామన్నది మ్యాటర్ కాదు..అర్థరాత్రి ఈ మరగుజ్జు దంపతులు చేసిన పనికి..

Couple : ఎంత ఉన్నామన్నది మ్యాటర్ కాదు..అర్థరాత్రి ఈ మరగుజ్జు దంపతులు చేసిన పనికి..

మరగుజ్జు దంపతులు

మరగుజ్జు దంపతులు

Two and a half feet couple : లోలోపల ధైర్యం ఉంటే అతి పెద్ద యుద్ధంలోనైనా విజయం సాధించవచ్చని పెద్దలు అంటుంటారు.

Two and a half feet couple : లోలోపల ధైర్యం ఉంటే అతి పెద్ద యుద్ధంలోనైనా విజయం సాధించవచ్చని పెద్దలు అంటుంటారు. రాత్రివేళ చీకట్లో ఇంట్లోకి ప్రవేశించిన దొంగను ఎంతో ధైర్యం ప్రదర్శించి, అది కూడా దొంగ వారి బారి నుంచి తప్పించుకోలేని విధంగా పట్టుకున్నారు మరగుజ్జు దంపతులు. బీహార్(Bihar) రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో ఈఘటన జరిగింది. ఈ మరుగుజ్జు జంటపై స్థానిక ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బక్సర్ జిల్లాలోని కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాన్ గ్రామంలో నివసించే రంజిత్ పాశ్వాన్-'సునైనా అనే మరుగుజ్జు దంపతుల ఇంట్లోకి రాత్రి చీకట్లో ఓ దొంగ ప్రవేశించాడు. అల్మారా తెరిచి సామాన్లు తీయడం ప్రారంభించాడు దొంగ. దొంగ ఇంట్లోకి ప్రవేశించిన విషయాన్ని రంజిత్ దంపతులు కనిపెట్టారు. ఆ దొంగ పారిపోకుండా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకవాలని రంజిత్ దంపతులు నిర్ణయించుకున్నారు. వెంటనే రెండున్నర అడుగుల పొడవున్న రంజిత్ పాశ్వాన్ మరియు అతని భార్య సునైనా ధైర్యం కూడగట్టుకొని దొంగను పట్టుకోవడమే కాకుండా పోల్ కు అతడిని కట్టేశారు. అనంతరం ఈ విషయం స్థానిక కృష్ణబ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.

Obesity : ఊబకాయానికి కారణం నాన్ వెజ్ తినడమే?సర్వేలో ఆశక్తికర విషయాలు

ఈ సంఘటన తర్వాత, స్థానిక ప్రజలు మరగుజ్జు జంట యొక్క ధైర్యాన్ని కొనియాడారు. భార్యాభర్తలు భయపడితే ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు తమతో పాటు విలువైన వస్తువులను తీసుకెళ్లారని, ఈ మరుగుజ్జు దంపతుల మనోధైర్యం వల్లే తమ ఇంట్లో దొంగతనం జరగడమే కాకుండా దొంగల చోరీ ఆగిందని స్థానికులు తెలిపారు. రంజీత్ పాశ్వాన్ భార్య సునైనా కూడా తన భర్తలాగే కేవలం రెండున్నర అడుగులు మాత్రమే. దొంగ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ఆమె తన భర్త రంజిత్‌కు కూడా సపోర్ట్ ఇచ్చి దొంగను పట్టుకున్నట్లు ఆమె చెబుతుంది. మరగుజ్జు దంపతులు కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్‌లో దొంగపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.

First published:

Tags: Bihar, Couples, Thief Arrested

ఉత్తమ కథలు