అమెజాన్ గిడ్డంగి(వేర్హౌన్) నుంచి ఖరీదైన ఫోన్లు మాయం అయ్యాయి. దాదాపు కోటి రూపాలయు విలువచేసే ఫోన్లను అక్కడ పనిచేసే వ్యక్తులే దోచేశారు. ఈ ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. తాజాగా చోరీకి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 38 ఖరీదైన ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నుహ్ ప్రాంతానికి చెందిన అన్సార్ హుల్ హక్, నవాబ్ సింగ్‌లుగా గుర్తించారు. వివరాలు.. నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రతినిధి అదిత్య సింగ్.. జమల్ పూర్ గ్రామంలోని తమ కంపెనీ వేర్‌హౌస్ నుంచి కోటి రూపాలయు విలువచేసే ఫోన్లు మిస్ అయ్యాయని ఫిర్యాదు చేశారు. మొత్తం 78 ఫోన్ బాక్స్‌లు ఖాళీగా ఉన్నాయని కంపెనీ గుర్తించినట్టుగా అదిత్య సింగ్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ సంస్థలో పనిచేసిన అన్సార్, నవాబ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న జూలై, ఆగస్టు కాలంలో నిందితులు ఫోన్లను దొంగిలించారని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో కోవిడ్ భయాందోళనల నేపథ్యంలో ఎంట్రీ పాయింట్ల వద్ద భౌతికపరమైన చెక్కింగ్ నిలిపివేశారని.. ఇదే అదునుగా నిందితులు తమ చేతులకు పనిచెప్పారని వెల్లడించారు. ఆ తర్వాత వారు సెప్టెంబర్‌లో వారిద్దరు జాబ్ వదిలేశారని చెప్పారు. దొంగిలించిన ఫోన్లలను తమ ఇళ్లలో ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారని చెప్పారు. తాము దాడులు జరిపిన సమయంలో 38 ఫోన్లు లభించాయని పేర్కొన్నారు.
ఈ ఘటన గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు(క్రైమ్) ప్రీత్‌పాల్ సింగ్ చెప్పారు. ఇందులో మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నట్టు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.