ట్విట్టర్ సీఈఓకు షాక్... ఎకౌంట్ హ్యాక్ చేసిన దుండగులు

ట్విటర్‌ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ ఖాతా హ్యాక్ అవ్వడంతో చాలామంది భయాందోళనలకు గురవుతున్నారు.

news18-telugu
Updated: August 31, 2019, 8:46 AM IST
ట్విట్టర్ సీఈఓకు షాక్... ఎకౌంట్ హ్యాక్ చేసిన దుండగులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 31, 2019, 8:46 AM IST
ట్విట్టర్ సీఈఓకే హ్యాకర్లు షాక్ ఇచ్చారు. రోజురోజుకు రెచ్చిపోతున్న హ్యాకర్తుల ఈసారి ఏకంగా ట్విట్టర్ సీఈఓ  జాక్ డోర్సీ ఎకౌంట్‌ను హ్యాక్ చేశారు. డోర్సీ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు శుక్రవారం హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు... వారు డోర్సీ ఎకౌంట్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అంతేకాదు.. ఆయన ఎకౌంట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెచ్చొగొట్టే మెసేజ్‌లు పోస్టు చేశారు. దీంతోఈ హ్యాకింగ్‌ను వెంటనే పసిగట్టిన ఎక్స్‌పర్ట్స్ డోర్సీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్ల నుంచి కాపాడారు. దుండగులు పోస్ట్‌ చేసిన అనుచిత సందేశాలను తొలగించారు. ఈ సందేశాల్లో జాత్యహంకార, దేశ విద్రోహ వ్యాఖ్యలు ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు డోర్సీ ట్విటర్‌ ఎకౌంట్ ఎలా హ్యాక్‌ అయింది? అసలు భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ట్విటర్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎంతటి ప్రముఖులైనా హ్యాకర్లు వదిలిపెట్టడం లేదు. సామాజిక మాధ్యమాల ఖాతాలు, బ్యాంక్‌ ఖాతాలు ఇలా ఏ తేడా లేకుండా అందులోకి చొరబడి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ట్విటర్‌ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ ఖాతా హ్యాక్ అవ్వడంతో చాలామంది భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ చీఫ్‌ ఖాతానే కాపాడలేనప్పుడు ఇక మిగతా యూజర్ల పరిస్థితి ఎంటని నిలదీస్తున్నారు.

First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...