‘నన్ను అమ్మాయిల జైలుకి మార్చండి సారూ’... అధికారులకు ట్రాన్స్‌జెండర్ ఖైదీ అభ్యర్థన...

అమ్మాయిగా మారేందుకు రకరకాల శస్త్రచికిత్సలు చేయించుకున్న 37 ఏళ్ల పురుషుడు... మోసాలు బయటపడి అరెస్ట్... మగాళ్ల జైలులో వేయడంతో ఆడాళ్ల జైలుకి మార్చాలంటూ వేడుకోలు... ట్రాన్స్‌జెండర్ అకాడమిడేషన్ రివ్యూ కమిటీకి కూడా రిక్వెస్ట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 3, 2019, 12:10 AM IST
‘నన్ను అమ్మాయిల జైలుకి మార్చండి సారూ’... అధికారులకు ట్రాన్స్‌జెండర్ ఖైదీ అభ్యర్థన...
నమూనా చిత్రం
  • Share this:
అతను ముందు అబ్బాయే. అయితే వెధవ మగజీవితం నచ్చక లింగమార్పిడి చేసుకన్నాడు. అయితే లింగమార్పడి శస్త్రచికిత్స కోసం అయ్యే ఖర్చు భరించే స్తోమత లేక దొంగతనాలకు అలవాడు పడ్డాడు. దొంగతనాలు కూడా వర్కవుట్ కావడం లేదని... జీవిత భీమా పేరిట జనాల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. అది బాగానే వర్కువుట్ అయిన లింగమార్పిడి పూర్తికాకముందే మోసం బయటపడి... పోలీసులకు చిక్కిపోయాడు. అంతా బాగానే ఉన్నా... మగాళ్ల జైల్లో వేయడమే ఆమెగా మారిన అతడికి ఏ మాత్రం నచ్చలేదు. అంతే తనను మహిళా జైలుకు మార్చాలంటూ అధికారులకు వినతి పత్రం రాసింది. ఈ చిత్రవిచిత్రమైన సంఘటన జరిగింది ఇక్కడ కాదు. అమెరికాలోని నార్త్ కరోలినాలో.

37 ఏళ్ల జేర్ బ్రౌన్ అనే అబ్బాయి... అమ్మాయిగా మారేందుకు రకరకాల శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. వాటి వల్ల పూర్తిగా అమ్మాయిగా మారలేకపోవడంతో పూర్తిస్థాయి చికిత్స చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే అందుకు భారీగా ఖర్చు అవుతుందని తెలిసి... డబ్బు కోసం ఇన్యూరెన్స్ పేరుతో మోసాలు చేయడం మొదలుపెట్టాడు. దొరికిన తర్వాత జైళ్లో వేశారు జేర్ బ్రౌన్‌ను... అక్కడే వచ్చింది అసలు సమస్య. ‘నేను మహిళను... మగాడిని అనుకుని మగాళ్ల జైళ్లో వేశారు. జైళ్లో 37 మంది మగాళ్లలో కలిసి ఒకే గదిలో ఉంటున్నా. చాలా భయంగా ఉంటోంది. మగాళ్లతో కలిసి స్నానం చేయాల్సి వస్తోంది... ఇప్పటికైనా నన్ను ఆడదానిగా గుర్తించి, మహిళల జైలుకు మార్చాలి’... అంటూ అధికారులకు వినతి పత్రం పంపింది జేర్ బ్రౌన్‌గా మారిన కెవిన్ చెస్ట్‌నట్. ఇప్పటిదాకా ఏ జైలు అధికారులకు ఇలాంటి సమస్య ఎదురుకాకపోవడంతో ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు అధికారులు. దాదాపు రెండేళ్ల కిందట అరెస్ట్ అయిన బ్రౌన్... అప్పటి నుంచి అధికారులను వేడుకుంటూనే ఉంది. ట్రాన్స్‌జెండర్ అకాడమిడేషన్ రివ్యూ కమిటీకి కూడా రిక్వెస్ట్ పెట్టింది అయినా ఫలితం లేకపోవడంతో మగాళ్లతోనే బిక్కుబిక్కుమని గడుపుతోంది.

First published: March 3, 2019, 12:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading