రామాయణంలో వాలి-సుగ్రీవుల కథ తెలుసుకదా.. ఒకేలా కనిపించే ఆ కవలసోదరులు ఒకరినొకరు మోసం చేసుకొని, ఒకరి భార్యను మరొకడు అనుభవించి, తప్పు నీదంటే నీదంటూ కొట్లాడుకోవడం, గొడవలు జరగడానికి ముందు నుంచే తమ్ముడి భార్యపై కన్నేసిన వాలి దుర్మార్గం హెచ్చుమీరి చివరికి శ్రీరాముడి చేతిలో చావడం తెలిసిందే. వాలి కథాంశంతో అదే పేరుతో అజిత్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చింది. అచ్చంగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఒకేలా కనిపించే కవలసోదరుల్లో ఒకడు తమ్ముడి భార్యను ఏమార్చి ఏకంగా ఆరునెలలపాటు వీలైనన్ని సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వాడి దుర్మార్గం బయటపడిన తర్వాత ఆ కుటుంబం ఇచ్చిన ట్విస్టుకు షాకైపోవడం బాధితురాలివంతైంది. అయితే ఇది త్రేతాయుగం కాదు కాబట్టి ఆమె తెగించి, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలివే..
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్ పరిథిలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఫ్యామిలీలో కవలసోదరులు ఆ ఏరియాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్లలో ఎవరు పెద్దోడు, ఎవరు చిన్నోడు అని ఇంట్లోవాళ్లే కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల కోసం తెగ వెదికారు. కానీ దొరకలేదు. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయిని కట్టబెట్టారు.
అత్తారింట్లో కాపురానికి వచ్చిన ఆ అమ్మాయి కూడా కవల సోదరుల్లో తన భర్తను కచ్చితంగా గుర్తుపట్టలేకపోయింది. ఈ క్రమంలో తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. ఒకేలా కనిపించే రూపంతో ఆమెను ఏమార్చాడు. తమ్ముడు లేని సమయం చూసుకొని అతనిలా గదిలోకి దూరి మరదలితో శృంగారకలాపాలు సాగించేవాడు. భర్తే కదానే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పేదికాదు. ఇలా ఆరు నెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా..
ఇటీవల ఓ సందర్భంలో భర్త తీరుపై ఆమెకు అనుమానం పెరిగింది. విషయం నిర్ధారించుకున్న వెంటనే.. బావ సాగిస్తోన్న వికృతాన్ని బాధితురాలు తన భర్త, అత్తమామలకు చెప్పేసింది. అయితే, కుటుంబీకులు అందరూ వాలికే వత్తాసు పలకడం ఆమెను మరింత షాక్ కు గురించేసింది. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు. ఇక భరించలేని స్థితిలో ఆమె తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో భర్త, బావ, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒకేలా కనిపించడాన్ని అడ్వాంటేజీగా తీసుకొని భర్తనని నమ్మించి బావగాడు తనపై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన బాధితురాలి బావతోపాటు అతనికి వత్తాసుపలికిన భర్త, అత్తమామలు, ఇతర కుటుంబీకులను సైతం అరెస్టు చేశారు. కవల సోదరుడిపై ఐపీసీ 378, 323, 506, 24 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే మీడియాకు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Maharashtra, Rape case