‘కుంకుమపువ్వు’ సీరియల్ నటుడు మధుప్రకాశ్ అరెస్ట్

'కుంకుమపువ్వు' సీరియల్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్న నటుడు మధు.. భార్య భారతి ఉరేసుకోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

news18-telugu
Updated: August 7, 2019, 4:17 PM IST
‘కుంకుమపువ్వు’ సీరియల్ నటుడు మధుప్రకాశ్ అరెస్ట్
కుంకుమపువ్వు ఫేం మధుప్రకాష్ అరెస్ట్
  • Share this:
భార్య భారతి ఆత్మహత్య కేసులో తెలుగుటీవీ నటుడు అరెస్ట్ అయ్యాడు.  మధుప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ నేపథ్యంలో మధుప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతి ఆత్మహత్యకు మధుప్రకాషే కారణమని  ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు భర్త మధుప్రకాష్‌ను అరెస్టు చేశారు. అదనపు వరకట్నం వేధింపుల కేసు కింద మధుప్రకాశ్ పై కేసులు నమోదు చేశారు. భారతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ తరలించారు.

'కుంకుమపువ్వు' సీరియల్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్న నటుడు మధు.. భార్య భారతి ఉరేసుకోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మధు ప్రకాష్ మాత్రం తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు. అయితే భారతి తల్లిదండ్రుల వాదన మాత్రం మరోలా ఉంది. మరో నటి పరిచయం కావడంతో భారతిని నిర్లక్ష్యం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతూ ఉంటే, వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు కూడా చేశామని అన్నారు. 15 లక్షల రూపాయలు కట్నమిచ్చి, ఘనంగా వివాహం జరిపించామని వాపోయారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>