హైదరాబాద్‌లో టీవీ సీరియల్ నటుడి భార్య ఆత్మహత్య

మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మధు షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చారు. కాగా భారతి తన బెడ్ రూమ్ లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు.

news18-telugu
Updated: August 7, 2019, 12:38 PM IST
హైదరాబాద్‌లో టీవీ సీరియల్ నటుడి భార్య ఆత్మహత్య
మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మధు షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చారు. కాగా భారతి తన బెడ్ రూమ్ లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు.
  • Share this:
టీవీ నటుడు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. టీవీ యాక్టర్ మధుప్రకాశ్  భార్య భారతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, భర్తల మధ్య గొడవలే భారతి మృతికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరుకి చెందిన భారతికి.. మధుప్రకాశ్‌తో 2015లో వివాహ జరిగింది. భారతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. భర్త, అత్తమామలు, మరిదితో మణికొండతో కలిసి పంచవటి కాలనీలో ప్లాట్‌లో నివసిస్తున్నారు.

తరచూ షూటింగ్‌లతో బిజీగా ఉండి భర్త ఇంటికి ఆలస్యంగా రావడం భారతికి ఇష్టం లేదు.  ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవి. తాజాగా సోమవారం కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చుసుకుంది.దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు జిమ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా అటు నుంచి అటే షూటింగ్‌కు వెళ్లిపోయారు. దీంతో కోపంతో భర్తకు వీడియో కాల్ చేసింది భారతి..తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించింది. అయితే మధు మాత్రి ఇవేమి పట్టించుకోలేదు. మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మధు షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చారు. కాగా భారతి తన బెడ్ రూమ్ లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు.

భర్త ఎంత పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో ఆయన తన దగ్గర ఉన్న మరో తాళంతో డోర్ తెరిచి లోనికి వెళ్లి చూశారు. భారతి సీలింగ్‌ ఫ్యాన్‌ కి వేలాడుతూ కనిపించారు. దీంతో షాక్ తిన్న మధు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరించారు. భారతి ఆత్మహత్య చేసుకున్న సమయంలో  మరిది ఇంట్లో లేరని, అత్తమామలు మరో గదిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మధుప్రకాశ్ ఆయన తల్లిదండ్రుల స్టేట్ మెంట్ తీసుకునే పనిలో ఉన్నారు.  భారతి ఆత్మహత్యకు భర్తతో గొడవలే కారణమా.. లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసును విచారిస్తున్నారు. మధుప్రకాష్ పలు టీవీ సీరియల్స్‌తో పాటు... బాహుబలి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు