Tv Actress Jhansi Suicide case: ఆత్మహత్య చేసుకోవడానికి కొన్నిగంటల ముందు ఏం జరిగింది?

Tv Actress Jhansi Suicide case:అప్పటికే సూర్య వేధింపులు ఎక్కువవ్వడంతో అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దీంతో సూర్య చేస్తున్న వేధింపులతోనే మానసికంగా బలహీనమై ఝాన్సీ సూసైడ్ చేసుకుందన్నారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 3:31 PM IST
Tv Actress Jhansi Suicide case: ఆత్మహత్య చేసుకోవడానికి కొన్నిగంటల ముందు ఏం జరిగింది?
ఝాన్సీ, సూర్య (File)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 3:31 PM IST
టీవీ యాక్టర్ నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో ఒక్కొక్క నిజాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రియుడు సూర్యను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందు సూర్యకు ఝాన్సీ కాల్ చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో సూర్య తనను తీవ్రస్థాయిలో మందలించడంతోనే ఝాన్సీ తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటికే సూర్య వేధింపులు ఎక్కువవ్వడంతో అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యాయే కారణమని తేల్చిన పోలీసులు.


దీంతో సూర్య చేస్తున్న వేధింపులతోనే మానసికంగా బలహీనమై ఝాన్సీ సూసైడ్ చేసుకుందన్నారు. గత కొన్ని నెలలుగా సూర్య-ఝాన్సీల మధ్య విభేధాలు చోటు చేసుకున్నాయన్నారు పోలీసులు. ఝాన్సీ చేత బలవంతంగా నటనను సూర్య మాన్పించినట్లు గుర్తించారు. ఆ విధంగా చేస్తేనే పెళ్లి చేసుకుంటానని షరతులు పెట్టాడన్నారు. అంతేకాకుండా ఝాన్సీ కదలికలపైన కూడా ఆంక్షలు విధించాడు. పెళ్లి చేసకుంటానని నమ్మించి మోసం కూడా చేశాడన్నారు.

tv actress jhansi death, telugu tv actress jhansi, tv serial actress jhansi, jhansi photos, hyderabad, telugu news, ఝాన్సీ, బుల్లితెర నటి, తెలుగు టీవీ నటి, ఆత్మహత్య, హైదరాబాద్
టీవీ నటి ఝాన్సీ




రెండు రోజుల క్రితమే సూర్యను అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు పోలీసులు.ఝాన్సీకి చెందిన రెండు మొబైల్స్ ను స్వాధీనం చేసుకొని విచారణ వేగవంతం చేశారు. తమ కూతురు ఆత్మహత్యకు సూర్య వేధింపులే కారణమని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు ఝాన్సీ కుటుంబసభ్యులు. తమకు ఎవరిపైనా అనుమానం లేదన్నారు ఝాన్సీ తల్లి అన్నపూర్ణ. తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి సూర్య మోసం చేశాడని ఆమె ఆరోపించారు.సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ వాంగ్మూలం ఇచ్చారు.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626