టీవీ నటిని రేప్ చేసిన జూ.ఆర్టిస్ట్.. పోలీసులకు ఫిర్యాదు..
ప్రస్తుతం తాను గర్భవతిని అని.. పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరితే ముఖం చాటేశాడని తెలిపారు. అప్పటినుంచి కనిపించకుండా పోయాడని చెప్పారు. అతని కుటుంబ సభ్యులకు తన గురించి తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు.
news18-telugu
Updated: November 17, 2019, 3:15 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: November 17, 2019, 3:15 PM IST
ఓ జూనియర్ ఆర్టిస్ట్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని టీవీ నటి ఒకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామిద్దరం హిందీలో పలు రియాలిటీ షోలకు కలిసి పనిచేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని చెప్పారు. అక్టోబర్ 13న అతను పార్టీకి రావాలని తనను పిలిస్తే వెళ్లాలని.. అక్కడ తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించారు. ప్రస్తుతం తాను గర్భవతిని అని.. పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరితే ముఖం చాటేశాడని తెలిపారు. అప్పటినుంచి కనిపించకుండా పోయాడని చెప్పారు. అతని కుటుంబ సభ్యులకు తన గురించి తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. అతని స్వస్థలం హర్యానాలోని యమూనగర్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.