ప్రముఖ నటిపై పెట్రోల్ బంక్‌లో దాడి..

తాను చెప్పిన దానికంటే ఎక్కువ పెట్రోల్ కొట్టడంతో ఇరువరి మధ్య వాగ్వాదం మొదలైంది. తాను రూ.1500 పెట్రోల్ కొట్టమని చెబితే.. అంతకంటే ఎక్కువ కొట్టి తిరిగి తననే దబాయించారని నటి వాపోయారు.

news18-telugu
Updated: August 27, 2019, 7:30 AM IST
ప్రముఖ నటిపై పెట్రోల్ బంక్‌లో దాడి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 27, 2019, 7:30 AM IST
కోల్‌కతాలోని కస్బా అనే ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో ప్రముఖ టీవి నటి ఒకరిపై దాడి జరిగింది. తన వాహనంలో పెట్రోల్ పోయించుకుంటున్న సందర్భంలో తలెత్తిన వాగ్వాదం కాస్త ఆమెపై దాడికి దారితీసింది. పెట్రోల్ బంక్ సిబ్బంది.. తాను చెప్పిన దానికంటే ఎక్కువ పెట్రోల్ కొట్టడంతో ఇరువరి మధ్య వాగ్వాదం మొదలైంది. తాను రూ.1500 పెట్రోల్ కొట్టమని చెబితే.. అంతకంటే ఎక్కువ కొట్టి తిరిగి తననే దబాయించారని నటి వాపోయారు. పొరపాటున ఎక్కువ కొట్టామని చెబుతూనే.. డబ్బు మాత్రం చెల్లించాల్సిందే అన్నారని తెలిపారు. అయితే వాళ్లు చేసిన పొరపాటుకు తామెందుకు డబ్బు చెల్లిస్తామని అడిగేసరికి తమను దూషిస్తూ దాడికి దిగారని ఆరోపించారు. అంతేకాదు, కారు తాళం కూడా తీసేసుకున్నారని.. దాంతో పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. పోలీసులు వచ్చాక గానీ గొడవ సద్దుమణగలేదని అన్నారు. ఈ సంఘటన గురించి సదరు నటి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు ఇప్పటికైతే ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీసీటీవి ఫుటేజీని పరిశీలించి.. దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

First published: August 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...