TSRTC TEMPORARY DRIVER MOLESTED LADY CONDUCTOR IN MANCHERIAL MS
దారుణం.. మహిళా కండక్టర్‌పై ఆర్టీసీ తాత్కాళిక డ్రైవర్ అఘాయిత్యం..
ప్రతీకాత్మకచిత్రం
ప్రతిఘటించిన బాధితురాలు అతని బారి నుంచి తప్పించుకుని జైపూర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నియమించిన ఓ తాత్కాళిక డ్రైవర్ మహిళా కండక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సు చెన్నూరు నుండి మంచిర్యాల వస్తున్న క్రమంలో ప్రయాణికులెవరూ ఎక్కకుండా జాగ్రత్తపడ్డాడు. మార్గమధ్యలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో బస్సును ఆపి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అయితే ప్రతిఘటించిన బాధితురాలు అతని బారి నుంచి తప్పించుకుని జైపూర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో గత 14 రోజులుగా ఆ సంస్థ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాటతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.తాత్కాలిక డ్రైవర్లను,కండక్టర్లను నియమించుకుంది. కొన్నిచోట్ల ప్రైవేట్ బస్సులను,అద్దె బస్సులను తీసుకుంది.అయితే కొంతమంది తాత్కాళిక సిబ్బంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా చేస్తున్నారు. బస్సులు సరిగా నడపక కొందరు.. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మరికొందరు వార్తల్లోకి ఎక్కుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.