TSRTC Strike | ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తత..

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 90శాతం కాలిన గాయాలు కావడంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

news18-telugu
Updated: October 12, 2019, 8:25 PM IST
TSRTC Strike | ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తత..
ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి
news18-telugu
Updated: October 12, 2019, 8:25 PM IST
తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆవేదన చెందాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 90శాతం కాలిన గాయాలు కావడంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రకటనతో మనోవేదనకు గురై ఆత్మహత్యయత్నం చేశాడు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం తో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు, కార్మిక సంఘాల నేతలు శ్రీనివాస్ రెడ్డి చికిత్సపొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో కార్మికులు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికమని కేసీఆర్ అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదన్నారు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదని కేసీఆర్ అన్నారు.



First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...