RTC Strike | ఖమ్మం జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

TSRTC Strike | ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినా కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదనే ఆవేదనతో మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

news18-telugu
Updated: October 12, 2019, 8:12 PM IST
RTC Strike | ఖమ్మం జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 12, 2019, 8:12 PM IST
ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినా కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదనే ఆవేదనతో మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సమయంలో మరో డ్రైవర్ వెంకటేశ్వరాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే, స్థానికులు వెంటనే అతడిని కాపాడారు. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం వార్త తెలిసిన వెంటనే కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి, ఖమ్మం కలెక్టరేట్ వద్దకు తరలివస్తున్నారు.

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆవేదన చెందాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 90శాతం కాలిన గాయాలు కావడంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రకటనతో మనోవేదనకు గురై ఆత్మహత్యయత్నం చేశాడు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం తో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు, కార్మిక సంఘాల నేతలు శ్రీనివాస్ రెడ్డి చికిత్సపొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో కార్మికులు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...